Dry Fruits Rava Laddu: అందరికీ ఎంతో ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ రవ్వ లడ్డు.. ఇలా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి!

Dry Fruits Rava Laddu: చాలామందికి డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసిన రవ్వ లడ్డును ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలియదు. అయితే వీరందరి కోసం మేము సులభమైన పద్ధతిలో రవ్వ లడ్డూరిని అందించబోతున్నారు. ఈ రవ్వ లడ్డు ని ఎలా తయారు చేసుకోవాలో? ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 20, 2024, 09:04 PM IST
Dry Fruits Rava Laddu: అందరికీ ఎంతో ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ రవ్వ లడ్డు.. ఇలా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి!

Dry Fruits Rava Laddu In Telugu: రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవుని పూజల్లో భాగంగా నైవేద్యానికి చాలామంది రవ్వలడ్డును వినియోగిస్తారు. ఈ రవ్వ లడ్డును ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది దీనిని చక్కెరతో తయారు చేసుకుంటే మరి కొంత మంది మాత్రం బెల్లంతో తయారు చేసుకుంటారు. చక్కెర కంటే బెల్లాన్ని వినియోగించి తయారుచేసిన రవ్వలడ్డున తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వీటిని పిల్లలకు సాయంత్రం పూట స్నాక్స్‌గా ఇవ్వడం వల్ల కూడా మంచి పోషకాలు లభిస్తాయి. అలాగే చాలామంది దీనిని తయారు చేసుకునే క్రమంలో ఎక్కువగా డ్రైఫ్రూట్స్ను వినియోగిస్తూ ఉంటారు. అలాగే బెల్లం పానకం పట్టే క్రమంలో కొంతమంది అంజీర్ మొక్కలను కూడా వేసుకుంటారు. ఇలా వేసుకుని తయారు చేసుకున్న రవ్వలడ్డులు శరీరానికి మరింత ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే ఇలా మీరు కూడా ఇంట్లోనే సులభంగా రవ్వ లడ్డులను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? మీకోసం జీ తెలుగు న్యూస్ సులభమైన పద్ధతిలో రవ్వ లడ్డు తయారీ విధానం అందించబోతోంది. 

రవ్వ లడ్డు రెసిపీకి కావలసిన పదార్థాలు:
❃ 1 కప్పు బొంబాయి రవ్వ (sooji)
❃ 1/2 కప్పు నెయ్యి
❃ 1/3 అంజీర్ పండ్ల చూర్ణము
❃ 1/2 కప్పు పంచదార
❃ 1/4 టీస్పూన్ యాలకుల పొడి
❃ 1/4 టీస్పూన్ జాజికాయ పొడి
❃ 1/4 కప్పు ఎండుద్రాక్ష
❃ 1/4 కప్పు జీడిపప్పు ముక్కలు
❃ 1/4 కప్పు బాదం ముక్కలు

తయారీ విధానం:
❃ ఈ రవ్వ లడ్డులను తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపై మందమైన కళాయి పెట్టుకుని అందులో రవ్వను వేసుకొని 10 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాల్సి ఉంటుంది.
❃  రవ్వ వాసన వచ్చే వరకు బాగా వేయించుకొని దింపి పక్కన పెట్టుకోవాలి.
❃ ఆ తర్వాత ఒక గిన్నెలో నెయ్యి కరిగించుకొని రవ్వను అందులో పోసుకొని మరో రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.
❃ ఆ తర్వాత స్టవ్ పై మరో చిన్న కళాయి పెట్టుకొని అందులో చక్కెరను వేసుకొని లడ్డూల ఆనకం పట్టుకోవాల్సి ఉంటుంది.
❃ ఇలా పట్టుకున్న దాంట్లోని యాలకుల పొడి, జాజికాయల పొడి వేసి రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!
❃ ఆ తర్వాత అందులోని నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు బాదం ఎందుకు ద్రాక్ష ముక్కలను వేసి మరో రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి.
❃ ఆ తర్వాత ఇందులోనే వేయించుకున్న రవ్వను పోసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి.
❃ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతే ఎంతో ఇష్టపడే రవ్వ లడ్డు తయారైనట్లే..

చిట్కాలు:
❃ రవ్వ లడ్డు రుచిగా ఉండడానికి ఎక్కువసేపు రవ్వను వేయించకుండా ఉండడం చాలా మంచిది.
❃ పంచదారకు బదులుగా బెల్లాన్ని వాడుకుంటే మంచి ఆరోగ్య లాభాలు పొందుతారు.
❃ లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వగా ఉండడానికి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే చాలా మంచిది.
❃ అంతేకాకుండా ఇందులో రవ్వకు సరిపడా డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకోవడం వల్ల లడ్డు మరింత రుచిగా ఉంటుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News