Drumstick Seeds Amazing Benefits: మునగ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ చెట్టులోని అన్ని భాగాలు ఔషధంగా పని చేస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మార్చి-ఏప్రిల్ నెలలో ఎక్కువగా మునగ చెట్టుకుని కాయలు కాస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలోనే మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తాయి. అయితే వేసవి కాలంలో వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఇందులో ఉండే ఔషధ గుణాలు ఈ కింది అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది:
క్రమం తప్పకుండా మునగ గింజలను ఆహారాల్లో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు మధుమేహాన్ని నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఆరోగ్య నిపుణులు ఈ గింజలను యాంటీ డయాబెటిక్‌గా పిలుస్తారు. అంతేకాకుండా ఈ గింజలతో తయారు చేసిన ఆహారాలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
జ్వరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది:
ఎండ కాలంలో చాలా మంది జ్వరం ఇతర వైరస్ల బారిన పడుతూ ఉంటారు. దీని కారణంగా శరీర శక్తి కూడా తగ్గిపోతుంది. అయితే ఇలాంటి వారు తప్పకుండా మునగ గింజలను ఆహారంలో తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల జ్వరం తగ్గడమే కాకుండా శరీరానిక తగిన శక్తి కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ పైరెటిక్ లక్షణాలు కూడా లభిస్తాయి. దీని కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
మలబద్ధకం నుంచి ఉపశమనం:
మునగ గింజలలో అధిక పరిమాణంలో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మలాన్ని మృదువుగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
కిడ్నీ సమస్యలకు చెక్:
తరచుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా మునగ గింజలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు అన్ని రకాల కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా డయాబెటిక్, ఆస్తమా సమస్యలు కూడా దూరమవుతాయి. దీంతో పాటు స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి