Potato Curry Recipe: బంగాళదుంపలతో రకరకాల వంటలు చేసుకోవచ్చు. ముఖ్యంగా బంగాళదుంప ఫ్రై, బంగాళదుంపతో కర్రీ, పొటాటోలతో రకరకాల చిప్స్, వేపుడు కూరలు కూడా తయారు చేసుకుంటాం. ఈ కూర రుచిగా ఉంటుంది. కొన్ని టిఫిన్స్ లో కూడా బంగాళదుంప కూరలను తయారు చేసుకుంటారు. ఏదైనా పప్పు, సాంబార్, చారులు తయారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా బంగాళదంపు వేపుడు ఉండాల్సిందే. అయితే, ఈరోజు మనం బంగాళదుంపతో రుచికరమైన కూరలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
బంగాళదుంప-2
ఉల్లిపాయ-1
పచ్చిమిర్చి-1
అల్లం వెల్లుల్లి-1TBSP
కరివేపాకు- కొద్దిగా
కొత్తిమీరా- కొద్దిగా
నూనె- సరిపడా
అవాలు, జిలకర్ర- 1/2TBSp
మినపప్పు-1Tbsp
ఉప్పు- రుచికి సరిపడా
ఇదీ చదవండి: Brown Rice: బ్రౌన్ రైస్ దివ్యౌషధం.. షుగర్ రోగులకు వరం..!
తయారు చేసుకునే విధానం..
బంగాళదుంపలను ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత తొక్క తీసి కట్ చేయాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలను పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఓ కడాయి తీసుకుని అందులో కూరకు సరిపడా నూనె వేయాలి. అందులో అవాలు, జిలకర్ర, మినపప్పు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు కాసింత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో కరివేపాకు, పసుపు వేయాలి. ఆ తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసి కలపాలి. ఇందులో ఉప్పు కూడా వేసుకుని ఓ కప్పు నీళ్లు పోయాలి. ఇప్పుడు మీడియం మంట మీద 10 నిమిషాలపాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరా, నిమ్మరసం వేసుకుంటే సరి వేడివేడిగా బంగాళదుంప కర్రీ రెడీ. దీన్ని అన్నంతోపాటు చపాతీ, పూరీలోకి కూడా తినొచ్చు. రుచి అద్భుతంగా ఉంటుంది.
ఇదీ చదవండి: కొవ్వును కరిగించే సబ్జాగింజలను ఇలా తినండి..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook