Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లో ఇది తిన్నారంటే.. మీ ఆరోగ్యానికి తిరుగేలేదు, ఆ సమస్యలు కూడా పరార్..

Best Breakfast ideas for Healthy Lifestyle: బ్రేక్ ఫాస్ట్ లో ఈ సూపర్ ఫుడ్ తిన్నారంటే నిత్య ఆరోగ్యం ఏ రోగాలు జీవితాంతం మీ దరి చేరవు.. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు సరైన ఆహారం తీసుకోవాలి. లైఫ్ స్టైల్ బాగుండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. అది రోజంతటికి కావలసిన శక్తి అందిస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం బ్రేక్ ఫాస్ట్ స్కిప్‌ చేస్తే గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యకరంగా ఉండాలంటే కొన్ని ఆరోగ్య నిపుణులు సూచనలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.. 

Written by - Renuka Godugu | Last Updated : Jan 27, 2025, 08:32 AM IST
Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లో ఇది తిన్నారంటే.. మీ ఆరోగ్యానికి తిరుగేలేదు, ఆ సమస్యలు కూడా పరార్..

Best Breakfast ideas for Healthy Lifestyle: ఈ ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మీ శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు సమస్య మీ దరిచేరకుండా ఉండాలంటే ఈ ఆహారాలు తీసుకోవాలి.  అంతే కాదు ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌ గుణాలు కూడా కలిగి ఉంటుంది. ఈ విధంగా కొన్ని ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఏ రోగాలు దరిచేరవు. అవేంటో తెలుసుకుందాం.

ఓట్ మీల్..
ఓట్ మిల్ లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతూ మంచి కడుపులో బ్యాక్టీరియా పెరిగేలా ప్రేరేపిస్తుంది. మన శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది .రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇక ఫైబర్ లెవెల్స్ పెంచుతుంది. కొన్ని రకాల పండ్లు, గింజలు, విత్తనాలతో కలిపి తీసుకోవడం వల్ల మరింత ఆరోగ్యం. ఇది ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్.

సిలియమ్‌ హస్క్..
సిలియమ్‌ హస్క్‌లో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ఈ ఆహారం కచ్చితంగా తమ బ్రేక్ ఫాస్ట్ లో ఉండేలా చూసుకోవాలి. మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మేలు చేస్తుంది. దీంతో పాటు మీరు అధిక మోతాదులో నీళ్లు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది.

బ్రాన్ ఫ్లెక్స్..
బ్రేక్ ఫాస్ట్ లో బ్రాన్ ఫ్లెక్స్ కూడా మంచి ఆప్షన్. ఇందులో గోధుమల కెర్నల్ ఉంటాయి. ఇందులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పెంచడానికి మంచి బెస్ట్ ఆప్షన్. మీ డైలీ రొటీన్ లో కచ్చితంగా ఉండాల్సిందే విటమిన్స్ మినరల్స్, పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు అందులో విటమిన్ బి ఐరన్ ఉండటం వల్ల మహిళలకు కూడా మేలు చేస్తుంది.

ఇదీ చదవండి:  బడ్జెట్‌లో ప్రధానమంత్రి రైతులకు భారీ శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత ఎప్పుడంటే?  

తృణధాన్యాలు..
 ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తృణధాన్యాలు డైట్లో చేర్చుకోవాలి. ముఖ్యంగా బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ వంటివి చేర్చుకోవడం వల్ల ఇందులో కరిగే కరగని ఫైబర్ ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని పాలలో తీసుకోవచ్చు లేదా పెరుగులో కలిపి తీసుకోవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి.

మ్యూస్లీ..
బ్రేక్ ఫాస్ట్ లో మ్యూస్లీ కూడా బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఇందులో గింజలు, నట్స్, డ్రైఫ్రూట్స్ ఉంటాయి.. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో కరిగే, కరగాని ఫైబర్ ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా కలిగి ఉంటాయి.. కాబట్టి బ్రేక్ఫాస్ట్ లో మ్యూస్లీ బెస్ట్ ఆప్షన్. ఇందులో ప్రోటీన్ కూడా తగ్గిన మోతాదులో ఉంటుంది. వీటిని చల్లని లేదా మామూలు పాలలో లేదా యోగార్ట్‌తో కలిపి తీసుకోవచ్చు. వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.

ఇదీ చదవండి:  విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. రేపు స్కూళ్లకు సెలవు..! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News