Benefit Of Chia Seeds: చియా గింజలు శరీరానికి చాలా రకాలుగా సహాపడతాయి. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. చియా గింజల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ఆహారాల్లో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీర బరువును తగ్గించడానికి కూడా సహాయపడతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగించాల్సి ఉంటుంది. అయితే దీనిని చలి కాలంలో తీసుకోవడం వల్ల జుట్టు, చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
చియా గింజలను వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఎముకలకు మంచిది:
ఈ విత్తనాలను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఎముకలు ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా మహిళలు ఎముకల సమస్యలతో బాధపడే వారు తప్పకుండా ఈ విత్తనాలను ఆహారంలో వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ అనారోగ్య సమస్యల నుంచి సులభంగా శరీరాన్ని రక్షిస్తుంది.
బరువు తగ్గడం:
ప్రస్తుతం చాలా మంది శరీర బరువును తగ్గించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పీచు, ప్రోటీన్లు అధికంగా ఉండే చియా గింజలను ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గింజల్లో ఉండే మూలకాలు పేగులోని మంచి బ్యాక్టీరియా వృద్ధి చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా వీటిని ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది.
చర్మం, జుట్టు సమస్యలకు చెక్:
చియా సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో వినియోగిస్తే చర్మం పొడిబారడం తగ్గించి ఇతర చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధిక పరిమాణంలో ఉండే చియా విత్తనాలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Man Raped Dog: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. వీధి కుక్కపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం! వైరల్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook