Siddaramaiah: కర్ణాటకలోని కెరూర్‌లో మాజీ సీఎం సిద్దరామయ్య పర్యటించారు. అల్లర్లలో గాయపడిన వారిని ఆయన పరామర్శించారు. ఈసందర్భంగా ఆర్థిక సాయం అందజేస్తూ వస్తున్నారు. ఈక్రమంలో సిద్ధరామయ్య ఊహించని షాక్ తగిలింది. ఆర్థిక సాయం అందజేస్తుండగా ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఇచ్చే డబ్బులు అవసరం లేదంటూ విసిరికొట్టింది.
కెరూర్ ఘటనలోని క్షతగాత్రులంతా బాగల్కోటేలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వ్యక్తిని మాజీ సీఎం సిద్ధరామయ్య పరామర్శించారు. అతడి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల పరిహారం అందజేశారు. అనంతరం కారులో వెళ్తుండగా ఓ మహిళ వాహనం దగ్గర వచ్చి..డబ్బులు విసిరేసింది. ఆ సమయంలో ఆ మహిళ ఉద్వేగానికి లోనైంది. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారు..ఆ తర్వాత పట్టించుకోరంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అందర్నీ సమానంగా చూడాలని తెలిపింది. రాజకీయ నాయకుల ఓదార్పు అవసరం లేదని..ప్రశాంతగా ఉండేలా చూడాలని పేర్కొంది. ఇప్పుడా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలోనూ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. కెరూర్‌లో ఈవీ టీజింగ్‌పై స్థానికంగా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఇరువర్గాల మధ్య గొడవ తలెత్తింది. మార్కెట్‌లో దుకాణాలు, వాహనాలను తగలబెట్టారు. ఈ ఘటనలో ముగ్గురిని గాయాలయ్యాయి. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
In a high-drama, a Muslim woman refuses to take Rs 2 lakh compensation given by opposition leader @siddaramaiah to those members of the families that suffered injuries during Kerur violence. Siddaramaiah enquired the health of all the injured. @XpressBengaluru @KannadaPrabha pic.twitter.com/Na66vO432y
— Mahesh M Goudar। ಮಹೇಶ್ ಮ ಗೌಡರ (@MahiPEN_TNIE) July 15, 2022
Also read:CM Jagan: పరవళ్లు తొక్కుతున్న గోదావరి..ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే..!
Also read:CM Jagan: ఏపీలో వానలు వరదలు..రాగల 24 గంటలు హైఅలర్ట్‌గా ఉండాలన్న సీఎం జగన్..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook