BlackBox: దేశమంతా ఉలిక్కిపడేలా చేసిన ప్రమాదమిది. దేశంలో ఓ అత్యున్నత అధికారిని కోల్పోయిన విషాద ఘటనిది. భారత రక్షణదళ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయిన హెలీకాప్టర్ క్రాష్‌లో బ్లాక్‌బాక్స్ ఎక్కడ. ఇప్పుడు దీనికోసమే అణ్వేషణ సాగుతోంది.
తమిళనాడు కూనూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందారు. భారత రక్షణశాఖకు చెందిన అత్యాధునిక ఎంఐ 17 వి5 ఛాపర్ నిన్న మద్యాహ్నం తమిళనాడులోని నీలగిరి జిల్లా కాట్టేరి ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక రావత్ మరో 11 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో హెలీకాప్టర్ మొత్తం కాలి బూడిదైపోయింది. డబుల్ ఇంజన్ ఫ్యూయల్ కావడంతో భారీగా మంటలు చెలరేగాయి.
వాస్తవానికి ఎంఐ 17 హెలీకాప్టర్(MI 17 V5 Helicopter) అత్యంత అధునాతనమైనదే కాకుండా చాలా సురక్షితమైందిగా పేరుంది. అటువంటి హెలీకాప్టర్ ప్రమాదానికి కారణాలేంటనేది అంతుబట్టడం లేదు. సాంకేతికంగా విఫలమయ్యే అవకాశాలు లేవనేది నిపుణులు చెబుతున్న మాట. అటువంటప్పుడు ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియాలంటే బ్లాక్‌బాక్స్ ఒక్కటే మార్గం. అందుకే ఇప్పుడు ఆర్మీ అధికారులు హెలీకాప్టర్ బ్లాక్ బాక్స్ కోసం అణ్వేషిస్తున్నారు. బ్లాక్‌బాక్స్(BlackBox) లభిస్తేనే ప్రమాదం ఎలా జరిగింది, ఏం జరిగిందనేది తెలుస్తుంది. బ్లాక్‌బాక్స్‌లో రికార్డయ్యే సమాచారాన్ని బట్టి ఇతర కారణాల్ని విశ్లేషిస్తారు. అందుకే బ్లాక్‌బాక్స్‌లో ఏముందో..అదెక్కడుందో తెలియాలి.
ఈ ప్రమాదంలో మరణించినవారిలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో(CDS General Bipin Rawat) పాటు ఆయన భార్య మధులిక, బ్రిగేడర్ ఎల్ఎల్ లిద్దర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, ఎస్కే గురుసేవక్ సింగ్, ఎన్కే జితేంద్రకుమార్, వివేక్ కుమార్, సాయితేజ, సత్పాల్ మరో ఐదుగురున్నారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే బతికారు. ప్రస్తుతం ఆయనకు వెల్లింగ్టన్ మిలటరీ అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హెలీకాప్టర్ పూర్తిగా కాలి బూడిదవడంతో బ్లాక్‌బాక్స్ పరిస్థితి ఏంటనేది సందేహంగా ఉంది.
Also read: Helicopter Crashes: హెలీకాప్టర్ ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు, వెంటాడుతున్న భయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook