24 గంటలపాటు అప్రమత్తంగా వుండాలి: ఐఎండీ

ఆఫ్రికాలో ప్రచండ గాలుల ప్రభావంతో సముద్రంలో అలలు ఉప్పెనలా ఎగసిపడుతున్నాయి.

Last Updated : Apr 25, 2018, 05:58 PM IST
24 గంటలపాటు అప్రమత్తంగా వుండాలి: ఐఎండీ

న్యూఢిల్లీ: ఆఫ్రికాలో ప్రచండ గాలుల ప్రభావంతో సముద్రంలో అలలు ఉప్పెనలా ఎగసిపడుతున్నాయి. వీటి ప్రభావంతో కేరళ తీరంలో 100 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆఫ్రికా గాలుల కారణంగా సముద్రంలో అలలు భారీగా విరుచుకుపడతాయని ప్రపంచ సునామీ హెచ్చరికల సంస్థ ఇన్ కాయిస్ పేర్కొంది. ఈ అలల ప్రభావం ఎక్కువగా భారత్‌లోని తూర్పు, పశ్చిమ తీరాలపై  ఉంటుందని ఇన్ కాయిస్ సంస్థ హెచ్చరించింది. సముద్ర తీర ప్రాంతంలో ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని ఇన్ కాయిస్ హెచ్చరించింది. ఈ నెల 26వ తేదీ వరకూ ఈ అలలు ఎగిసిపడతాయని పేర్కొంది.

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. అండమాన్‌ తీరం నుంచి భారత్‌ ప్రధాన భూభాగం వైపు అలలు వస్తున్నాయని, తమిళనాడు, ఏపీ, ఒడిశా, బెంగాల్‌ తీరాల్లో అలలు అలజడి సృష్టిస్తాయని ఆ సంస్థ పేర్కొంది. పశ్చిమ తీరంలో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తీరాల్లోని అలలు అలజడి సృష్టిస్తాయని తెలిపింది.

 

Trending News