జమ్ము కాశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. సరిహద్దుల్లో నుంచి ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించారన్న సమాచారం తెలుసుకున్న ఆర్మీ సిబ్బంది.. ఈ రోజు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఉదయం నుంచి సెర్చ్ ఆపరేషన్ జరిగింది.
పుల్వామా జిల్లాలోని అవంతిపురా సమీపంలోని గోరిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందుకున్నారు భారత ఆర్మీ సిబ్బంది. ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. కొద్దిసేపటి తర్వాత ఉగ్రవాదుల వైపు నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ముష్కర మూకలపై ఆర్మీ బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులతోపాటు వారికి సహకరించిన వ్యక్తిని కూడా ఆర్మీ బలగాలు మట్టుబెట్టాయి. వారి దగ్గర నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తెచ్చిపెట్టుకున్నారంటే .. ఉగ్రదాడికి వ్యూహం సిద్ధం చేసినట్లు ఆర్మీ సిబ్బంది అనుమానిస్తున్నారు. మొత్తానికి ముష్కరుల కుట్ర భగ్నం కావడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..