Twin brothers died: కవల సోదరులు.. కలిసే పుట్టారు.. కలిసే పెరిగారు.. Corona తో కలిసే కన్నుమూశారు

Twin brothers dies of COVID-19: కరోనావైరస్ సెకండ్ వేవ్ ఎంతో మందికి అయినవాళ్లను దూరం చేస్తోంది. ఎన్నో ఇళ్లలో ఏదో ఓ రూపంలో అశాంతిని నింపుతోంది. తాజాగా ఓ కుటుంబంలో ఇద్దరు కవల సోదరులను కొన్ని గంటల వ్యవధిలోనే పొట్టనపెట్టుకుంది ఈ కరోనా. కలిసే పుట్టారు.. కలిసే పెరిగారు.. కలిసే చదువుకున్నారు.. చివరకు చావులోనూ ఈ లోకంలోంచి కలిసే వెళ్లిపోయారు.

Last Updated : May 19, 2021, 07:40 PM IST
  • కుటుంబంలో ఇద్దరు కవల సోదరులను కొన్ని గంటల వ్యవధిలోనే పొట్టనపెట్టుకున్న COVID-19.
  • పెరిగి, పెద్దవాళ్లయిన కొడుకులు ఇలా Coronavirus కి బలవడం చూసి తట్టుకోలేకపోతున్న తల్లిదండ్రులు.
  • తగ్గినట్టే తగ్గి డిశ్చార్జ్ అయ్యేలోపే మళ్లీ కాటువేసిన కరోనావైరస్..
Twin brothers died: కవల సోదరులు.. కలిసే పుట్టారు.. కలిసే పెరిగారు.. Corona తో కలిసే కన్నుమూశారు

Twin brothers dies of COVID-19: కరోనావైరస్ సెకండ్ వేవ్ ఎంతో మందికి అయినవాళ్లను దూరం చేస్తోంది. ఎన్నో ఇళ్లలో ఏదో ఓ రూపంలో అశాంతిని నింపుతోంది. తాజాగా ఓ కుటుంబంలో ఇద్దరు కవల సోదరులను కొన్ని గంటల వ్యవధిలోనే పొట్టనపెట్టుకుంది ఈ కరోనా. కలిసే పుట్టారు.. కలిసే పెరిగారు.. కలిసే చదువుకున్నారు.. చివరకు చావులోనూ ఈ లోకంలోంచి కలిసే వెళ్లిపోయారు. కవల సోదరులు అయిన ఆ ఇద్దరినీ పుట్టుకే కాదు.. చివరకు చావు కూడా విడదీయలేకపోయింది. పెరిగి పెద్ద వాళ్లయి, ఉన్నత చదువులు చదువుకుని, ఉద్యోగాలు చేసుకుంటూ ఇక చేతికి అందొచ్చారు అనుకునే సమయంలో 24 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కవల సోదరులను పొట్టనపెట్టుకుని ఆ తల్లిదండ్రులకు తీరాన్ని దుఖాన్ని మిగిల్చింది. 

ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గ్రెగరీ రేమండ్ రాఫెల్‌కు ముగ్గురు సంతానం. మొదటి కాన్పులో ఒక కొడుకు పుట్టాకా రెండో కాన్పులో మూడు నిమిషాల తేడాతో ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఆ కవల సోదరులు ఇద్దరి పేర్లు జోఫ్రెడ్ వర్ఘీస్ గ్రెగరీ, రాల్ఫ్రెడ్ వర్గీస్ గ్రెగరీ. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. ఏప్రిల్ 23నే వీళ్ల బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. ఆ మరునాడే ఇద్దరికీ కరోనా పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ తర్వాత వాళ్ల సోదరుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. తొలుత ముగ్గురు కొడుకులకు ఇంట్లోనే చికిత్స అందేలా చూసుకున్నారు వారి తల్లిదండ్రులు. కానీ వారికి ఆక్సీజన్ లెవెల్స్ (Oxygen levels) పడిపోతుండటంతో వైద్యుల సూచనల మేరకు ఆస్పత్రిలో చేర్పించారు. మే 1 ఆస్పత్రిలో చేరగా మే 10న చిన్న కొడుక్కి నెగటివ్ అని తేలింది.

Also read : Covishield Side Effects: కోవిషీల్డ్ సైడ్‌ ఎఫెక్ట్స్ , లక్షణాల జాబితా విడుదల చేసిన కేంద్రం

కొవిడ్ వార్డ్ నుంచి సాధారణ ఐసీయూకి తరలించేందుకు డాక్టర్లు ఏర్పాట్లు చేసుకుంటుండగా తానే డాక్టర్లతో మాట్లాడి మరో రెండు రోజుల పాటు కొవిడ్ వార్డులోనే పర్యవేక్షణలో ఉంచాల్సిందిగా కోరాను. మే 13న ఉదయం జోఫ్రెడ్ వర్గీస్‌కి శ్వాస తీసుకోవడంలో (Breathing issues) ఇబ్బందులు ఎదురయ్యాయి. అదే రోజు రాత్రి 11 గంటలకు జోఫ్రెడ్ చనిపోయినట్టు ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పి బోరుమన్నాడు అతడి తండ్రి రేమండ్ రాఫెల్. 

అదే ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉన్న రాఫ్రెడ్ తన సోదరుడు జోఫ్రెడ్ ఆరోగ్యం గురించి వాకబు చేయగా.. జోప్రెడ్ పరిస్థితి విషమంగా ఉందని, అతడిని మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలిస్తున్నామని అబద్దం చెప్పింది ఆ తల్లి. కానీ తల్లి నోటి వెంట వచ్చిన అబద్దాన్ని కొడుకు పసిగట్టకుండాపోలేదు. ''అమ్మా నువ్వు అబద్దం చెబుతున్నావు.. ఏం జరిగిందో చెప్పమ్మా'' అని బతిమాలుకున్నాడు. ఆ మరునాడే.. కొన్ని గంటల వ్యవధిలోనే రాఫ్రెడ్ కూడా కరోనాతో కన్నుమూశాడు. 

Also read : Vaccine first dose తీసుకున్న తర్వాత కరోనా సోకితే ఏం చేయాలి ? Second dose ఎప్పుడు తీసుకోవాలి ?

కోయంబత్తూరులోని కారుణ్య యూనివర్శిటీ నుంచి బీటెక్ చేసిన ఇద్దరు కవల సోదరుల్లో ఒకరు యాక్సెంచర్‌లో జాబ్ చేస్తుండగా మరొకరు హ్యుందాయ్ ముబిస్ కంపెనీకి పనిచేస్తున్నారు. కరోనా కారణంగా ఇద్దరు ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home) చేస్తున్నారు. అలా అంతా హ్యాపీగా ఉన్న ఆ కుటుంబాన్ని కరోనా ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Also read : COVID-19 Vaccine: భారత్‌లో కరోనా వేరియంట్లపై ఏ వ్యాక్సిన్లు ప్రభావం చూపుతాయో తెలుసా
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News