మరో బోరుబావి ఘటన చివరకు ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని నివారి జిల్లాలోని సేతుపురా గ్రామంలో ఆడుకుంటూ మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ తెరిచి ఉన్న బోరుబావిలో (3 year old boy fell into an open borewell) పడిపోయాడు. పృథ్వీపూర్ ప్రాంతంలోని సేతుపురాలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అయితే బుధవారం రాత్రి నివారి జిల్లా ఏఎస్పీ ప్రతిభా త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ.. మరో రెండు లేక మూడు గంటల్లో చిన్నారిని సురక్షితంగా బయటకు తీస్తామని చెప్పారు. కానీ మరో 12 గంటలు గడిచిపోతున్నా సహాయక చర్యలు కొనసాగుతున్నాయే తప్ప.. ఆ బాలుడిని ఇంకా బయటకు తీయలేదు. గంటలు గడిచేకొద్దీ తమ చిన్నారికి ఏమవుతుందోనని మూడేళ్ల బాలుడి తల్లిదండ్రులలో ఆందోళన పెరిగిపోతోంది.
Madhya Pradesh: Rescue operations continue to save a 3-year old boy, who fell into an open borewell yesterday morning in Niwari district.
Latest visuals of joint rescue operation from Setupura Village https://t.co/zmMOWZIvkr pic.twitter.com/Zihh9Es6M5
— ANI (@ANI) November 5, 2020
జేసీబీలతో బోరు బావి పక్కన లోతుగా తవ్వుతున్నారు. అధికారులు, రెస్క్యూ టీమ్ సభ్యులు అందరూ ఘటనా స్థలంలో పనులు వేగవంతం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు గురువారం ఉదయం భారీగా అక్కడికి చేరుకున్నారు. బాలుడు ప్రాణాలతో బయటకు రావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.
- Also Read : EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe