COVAXIN Vaccine Price: కోవాగ్జిన్ టీకా ధరలు ప్రకటించిన Bharat Biotech, కోవిషీల్డ్ కన్నా ఎక్కువ ధర

Price Of COVAXIN Vaccine: మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరూ కరోనా టీకాలు తీసుకునేందుకు అర్హులవుతారు. ఈ మేరకు ఇటీవల కోవిషీల్డ్ ధరలు ప్రకటించారు. తాజాగా భారత్ బయోటెక్ తాము రూపొందించిన కోవిడ్19 టీకాల ధరలు నిర్ణయించింది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 25, 2021, 10:01 AM IST
COVAXIN Vaccine Price: కోవాగ్జిన్ టీకా ధరలు ప్రకటించిన Bharat Biotech, కోవిషీల్డ్ కన్నా ఎక్కువ ధర

 Price Of COVAXIN Vaccine: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో టీకాల ఆవశ్యకత పెరిగింది. సాధ్యమైనన్ని టీకాలు ఉత్పత్తి చేసి అందించేందుకు ఫార్మా దిగ్గజాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మరోవైపు మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరూ కరోనా టీకాలు తీసుకునేందుకు అర్హులవుతారు. ఈ మేరకు ఇటీవల కోవిషీల్డ్ ధరలు ప్రకటించారు. తాజాగా భారత్ బయోటెక్ తాము రూపొందించిన కోవిడ్19 టీకాల ధరలు నిర్ణయించింది.

భారత్‌లో ప్రస్తుతం ఆమోదం పొంది పంపిణీ చేస్తున్న టీకాలు కోవిషీల్డ్, కోవాగ్జిన్. కరోనాపై పోరాటానికి భార‌త్ బ‌యోటెక్‌ రూపొందించిన కోవాగ్జిన్ టీకాలు భారీ మొత్తంలో మార్కెట్‌లోకి తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులకు, ప్రైవేట్ ఆసుపత్రులకు, విదేశాలకు ఎగుమతి చేయడానికి కరోనా టీకాల ధరలు(Covaxin Price) ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాల‌కు రూ.600, ప్రైవేట్ ఆస్పత్రుల‌కు రూ.1,200, విదేశాల‌కు ఎగుమ‌తి చేయనున్న టీకాల‌కు 15 నుంచి 20 అమెరికా డాల‌ర్లుగా కోవాగ్జిన్ టీకాల ధరలను భారత్ బయోటెక్ ప్రకటించింది. 

Also Read: Covisheild Vaccine Price: కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలు ప్రకటించిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా

కాగా, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ కరోనాపై పోరాటంలో భాగంగా కోవిషీల్డ్ టీకాలు రూపొందించింది. ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.400కు, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.600 చొప్పున కోవిషీల్డ్ టీకా ఒక్క డోసును విక్రయించనున్నట్లు సీరం సంస్థ ఇటీవల ప్రకటించింది. తమ ఉత్పత్తులలో సగం వాటా కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నామని సీరం సీఈవో ఆధార్ పూనావాలా ప్రకటించడం తెలిసిందే. యువతకు సైతం కరోనా టీకాలు(Corona Vaccine) ఉచితంగా ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి.

Also Read: COVID-19 Oxygen Levels: ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకునేందుకు ఈ చిట్కా పాటించండి, బీ అలర్ట్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News