Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ సన్నద్ధతపై ప్రధాని మోదీ కీలక సమీక్ష

Tokyo Olympics: ఒలింపిక్స్ క్రీడల కోసం భారతదేశం సన్నద్ధమవుతోంది. టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. దేశ ప్రతిష్ఠను పెంచేందుకు ఒలింపిక్స్ దోహదపడతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 3, 2021, 07:55 PM IST
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ సన్నద్ధతపై ప్రధాని మోదీ కీలక సమీక్ష

Tokyo Olympics: ఒలింపిక్స్ క్రీడల కోసం భారతదేశం సన్నద్ధమవుతోంది. టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. దేశ ప్రతిష్ఠను పెంచేందుకు ఒలింపిక్స్ దోహదపడతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 

టోక్యోలో త్వరలో ఒలింపిక్స్(Tokyo Olympics) జరగనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ఆలస్యమయ్యాయి. మరో 50 రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఒలింపిక్స్‌కు సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సమీక్ష(Pm Modi review on Olympics) నిర్వహించారు. దేశ సంస్కృతికి క్రీడలనేవి హృదయం లాంటివని..దేశ ప్రతిష్టను పెంచేందుకు దోహదపడతాయని మోదీ స్పష్టం చేశారు. దేశ యువత బలమైన, తేజోవంతమైన క్రీడా సంస్కృతిని సృష్టిస్తున్నారంటూ మోదీ అభినందించారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు దేశంలోని 135 కోట్ల ప్రజల శుభాకాంక్షలు, దీవెనలు ఉంటాయని మోదీ చెప్పారు.

ఒలింపిక్స్ సన్నద్ధతపై సమీక్ష సందర్భంగా క్రీడాకారులందరికీ వ్యాక్సినేషన్‌తో పాటు సరైన శిక్షణ, ఇతర మౌళిక సదుపాయాలు కల్పించాలని మోదీ( Pm Narendra modi) సూచించారు. ఒక్కొక్క క్రీడాకారుడు తన ప్రతిభతో మరో వందమందిలో స్ఫూర్తి నింపుతారన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. టోక్యోలో జరగనున్న క్రీడల్లో మనదేశం నుంచి 11 క్రీడా విభాగాల్లో మొత్తం వందమంది అథ్లెట్లు అర్హత సాధించారన్నారు. జూన్ నెలఖారునాటికి మరో 25 క్రీడల్లో అర్హత సాధించే అవకాశాలున్నాయని మోదీ చెప్పారు.

Also read: Covaxin Trials on Children: చిన్నారులపై ప్రారంభమైన కోవ్యాగ్జిన్ ట్రయల్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News