సీఎం సిద్దరామయ్య బాదామి నుంచి గెలుపొందారు. సిద్ధూ తన సమీప ప్రత్యర్థి శ్రీరాములు కంటే 5 వేల ఓట్ల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. బాదామీ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ ఆధిక్యతలు మారుతూ వచ్చాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థి శ్రీరాములు, సిద్దరామయ్యకు గట్టిపోటీనిచ్చారు.ఒక దశలో సిద్దరామయ్య ఇక్కడ నుంచి కూడా పరాజయం పాలౌతారా అన్నట్లుగా సరళి సాగింది. అయితే చివరికి సిద్దరామయ్య బాదామి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి బీ శ్రీరాములకు 56822 ఓట్లు పోలయ్యాయి.
చాముండేశ్వరి నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సిద్దరామయ్య జేడీ(ఎస్) సీనియర్ నాయకుడు జీటీ దేవెగౌడ్ కంటే వెనుకంజలో ఉన్నారు. జీటీ దేవెగౌడకు 64609 ఓట్లు పోలవ్వగా, సిద్దరామయ్యకు 41456 ఓట్లు పోలయ్యాయి.