కర్ణాటకలో రెండు వారాల విరామం తరువాత కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. గవర్నర్ వాజుభాయ్ వాలా కాంగ్రెస్ నుంచి 14 మంది, జెడీఎస్ నుంచి ఏడుగురిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత జేడీఎస్ ఎమ్మెల్యే కుమార స్వామి సోదరుడు హెచ్‌డీ రేవణ్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక బీఎస్పీ, కేపీజేపీలనుంచి చెరొకరికి మంత్రివర్గంలో స్థానం లభించింది. కర్ణాటక రాజ్‌భవన్ గ్లాస్ హౌస్‌లో మంత్రుల ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
కాంగ్రెస్‌కు దక్కిన శాఖలు: హోం, ఇరిగేషన్, బెంగళూరు సిటీ డెవలప్‌మెంట్, పరిశ్రమలు, ఆరోగ్యం, రెవిన్యూ, పట్టాణ, గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయం, వైద్య విద్య, హౌసింగ్, కార్మిక, స్త్రీ, శిశు సంక్షేమ, అటవీ & పర్యావరణ, మైన్ & జియాలజీమ్ సాంఘిక సంక్షేమ, పౌర సరఫరాల శాఖ, శాసన సభ వ్యవహారాల శాఖ, ఐటీ&బీటీ సైన్సు అండ్ టెక్నాలజీ, కన్నడ సాంస్కృతిక, క్రీడా&యువజన మంత్రిత్వ శాఖ, హజ్&వక్ఫ్, మైనార్టీ సంక్షేమ శాఖ, పోర్టులు, అంతర్గత రవాణా అభివృద్ధి శాఖ
JUST IN: Karnataka cabinet ministers from Congress @dna pic.twitter.com/lxwwYHr4FG
— amrita madhukalya (@visually_kei) June 6, 2018
జేడీఎస్‌కు దక్కిన శాఖలు: ఆర్థిక, ఎక్సైజ్, సమాచార, ఇంటలిజెన్స్, సాధారణ పరిపాలన, ప్లానింగ్&స్టాటిస్టిక్స్, పబ్లిక్ వర్క్ డిపార్టుమెంటు, విద్యుత్, కో-ఆపరేషన్, టూరిజం, విద్య, పశు సంరక్షణ&మత్స్య శాఖ, ఉద్యానవన&పట్టుపురుగుల పెంపకం, చిన్న తరహా పరిశ్రమలు, రవాణా మరియు చిన్న నీటి పారుదల శాఖలు.
JD (S) ministers in Karnataka cabinet @dna pic.twitter.com/mX2mtCUMeJ
— amrita madhukalya (@visually_kei) June 6, 2018
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకులు, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చర్చించి మంత్రి పదవులు ఖరారు చేశారు. రాహుల్ ఆమోదం పొందిన జాబితా అందిన తర్వాతనే సీఎం కుమారస్వామి మంత్రివర్గ ఏర్పాటుకు సిద్దమయ్యారు. కాగా కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్‌కు కీలక మంత్రి పదవీ దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం. డీకే పేరుతో పాటు కేజే జార్జ్, ప్రియంకా ఖార్గే పేర్లు ఆ జాబితాలో ఉన్నట్టు ఏఎన్‌ఐ తెలిపింది. రానున్న 2019 పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాహుల్ అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిసింది.