AS Kiran Kumar: భారతదేశం అంతరిక్ష సాంకేతికతలో అద్భుతమైన పురోగతి సాధించిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. ప్రపంచంలోని టాప్ ఐదు దేశాల్లో భారత్ ఉందని ప్రకటించారు. త్వరలోనే అంగారక గ్రహంపై భారత్ అడుగుపెట్టబోతుందని ప్రకటించారు. చంద్రయాన్ 2 విఫలమవడం ఒక పాఠమని పేర్కొన్నారు. తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు సాగుతామని తెలిపారు.
Also Read: Pending DAs: 'ప్రభుత్వ ఉద్యోగులకు 4 డీఏలు, 2వ పీఆర్సీ ఎప్పుడు?'
ఫతేపూర్‌లోని ప్రఖ్యాత ఆలయాన్ని కిరణ్ కుమార్ మంగళవారం సందర్శించారు. బీరా బార్జీని సందర్శించి పూజలు, ప్రార్థనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కిరణ్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. భారతదేశం అంతరిక్ష రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తోందని తెలిపారు. 'చంద్రయాన్ 2 వైఫల్యం ఒక పాఠంగా గుర్తించి ముందడుగు వేయాలి. వైఫల్యాలకు భయపడే బదులు వాటి నుంచి పాఠం నేర్చుకుని సాగిపోవాలి' అని కిరణ్ కుమార్ పేర్కొన్నారు. భారతదేశం త్వరలోనే అంగారక గ్రహంపైకి విజయవంతంగా అడుగు పెడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: Supreme Court Jobs: డిగ్రీతో సుప్రీంకోర్టులో భారీగా ఉద్యోగాలు.. ఎంత జీతం తెలుసా?
విశేషంగా అంతరిక్ష సేవలు
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రోకు ఏఎస్ కిరణ్ కుమార్ మూడేళ్లు చైర్మన్‌గా వ్యవహరించారు. 2015 నుంచి 2018 వరకు ఇస్రో చైర్మన్‌గా ఉన్న కిరణ్ కుమార్ ఉన్న సమయంలో ఇస్రో కీలక ప్రయోగాలు చేపట్టింది. అత్యంత విజయవంతమైన అంతరిక్ష ప్రయోగాలు చేసిన విషయం తెలిసిందే. ఒకే మిషన్‌లో 144 ఉపగ్రహాలను ప్రయోగించిన ఘనత కిరణ్ కుమార్ నాయకత్వానికి దక్కింది. చంద్రయాన్, మంగళయాన్ ప్రయోగాల్లో కిరణ్ కుమార్ కీలక పాత్ర పోషించారు.
అవార్డులు
అంతరిక్ష రంగంలో కిరణ్ కుమార్ సేవలు మరువలేనివి. అంతరిక్ష శాస్త్రవేత్తగా కిరణ్ కుమార్ అనేక పురస్కారాలు పొందారు. 2014 కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించగా.. 2019లో ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రత్యేక గౌరవం అందించింది.
2018లో వాన్ కర్మాన్ వింగ్ అవార్డు
2006లో ఇస్రో అవార్డు
2007లో భాస్కర్ అవార్డు
2008లో ఇస్రో పర్మార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.