భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 543 రోజుల కనిష్టానికి కొత్త కేసులు

భారత్ లో కరోనా కొత్త కేసుల సంఖ్య కొంత ఊరటనిస్తోంది.. గడచిన 24 గంటల్లో 7,579 కొత్త కేసులు నమోదవ్వగా.. 236 మంది కరోనా కారణంగా మరణించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2021, 11:07 AM IST
  • భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు
  • 543 రోజుల కనిష్టానికి కొత్త కేసులు
  • 117 కోట్ల మందికి పూర్తైన కరోనా వ్యాక్సినేషన్
భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 543 రోజుల కనిష్టానికి కొత్త కేసులు

India reports 7579 new covid 19 cases death count is 236: గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారత్ లో తగ్గుముఖం పడుతున్నాయి.. కొత్త కేసులు రోజు రోజు తక్కువగా నమోదవ్వటం మనం చూడవచ్చు.. మంగళవారం కేద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 

గడిచిన 24 గంటల్లో దేశంలో 9,64,980 కరోనా పరీక్షలు నిర్వచించగా... 7,579 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు గత 543 రోజుల్లో అత్యల్పంగా కరోనా కేసులు నమోదవ్వగా.. ఇండియాలో కోవిడ్ -19 కేసుల్లో భారీ క్షీణత కనిపిస్తుంది. 

Also Read: వాటే స్టన్నింగ్ క్యాచ్: అరే ఏంట్రా ఈ క్యాచ్.. సోధి సింగిల్ హ్యాండ్.. షాక్‌లో రోహిత్.. వైరల్ వీడియో!

24 గంటల్లో 236 కోవిడ్ మరణాలు

కరోనా కేసుల్లో టాప్ లో ఉన్న రాష్ట్రాల్లో అత్యధికంగా కేరళలో (Kerala) 3,698 కేసులు నమోదవ్వగా.. 180 మంది కేరళలో మరణించారు. దేశవ్యాప్తంగా 236 మంది కరోనా కారణంగా చనిపోగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4,66147 మంది కరోనా భారీన పడి చనిపోయారు. 

గత 24 గంటల్లో మొత్తం 12,202 మంది కరోనా నుండి కోలుకోగా.. దీనితో దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,39,కోట్లకు చేరుకుంది. దీంతో భారత్ రికవరీ రేటు ఇప్పుడు 98.32 శాతానికి పెరిగింది. క్రియా శీలక రేటు 0.33 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో యాక్టివ్ (Active covid-19 Cases) భారతదేశంలో యాక్టివ్  కరోనా కేసుల సంఖ్య 1,31,584గా ఉంది.

Also Read: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదేనా ?

కరోనా వ్యాక్సినేషన్ 

గత 24 గంటల్లో మొత్తం 71,92,154 డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి, దీనితో మొత్తం డోస్‌ల పంపిణీ సంఖ్య 117 కోట్లకు పైగా చేరుకుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News