India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. అయితే.. గత కొన్నిరోజులుగా దేశంలో నిత్యం 70వేలకుపైగా నమోదవుతున్న కేసులు కాస్త.. రెండురోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీ రేటు నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 87.05 శాతం ఉండగా.. మరణాల రేటు 1.53 శాతం, యాక్టివ్ కేసుల రేటు 11.42 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. Also read: Hyderabad Rains: నగరంలో ఎటుచూసినా నీరే.. హెల్ప్ లైన్ నెంబర్ల జారీ
గత 24గంటల్లో మంగళవారం ( అక్టోబరు 13న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 63,509 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 730 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 72,39,390 కి చేరగా.. మరణాల సంఖ్య 1,10,586 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 63,01,928 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 8,26,876 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. మంగళవారం దేశవ్యాప్తంగా 11,45,015 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో అక్టోబరు 13 వరకు మొత్తం 9,00,90,122 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. Also read: Keesara Ex MRO Nagaraju Suicide: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe