India asks Pakistan to expedite trial in 26/11 Mumbai terror attacks case: 2008, సెప్టెంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ దాడులకు నేటితో 13 ఏళ్లు. ఆ ఘాతుకానికి పాల్పడ్డ ఉగ్రమూకల్ని పట్టుకోవాలని ఇవాళ ఇండియా పాకిస్థాన్‌ను కోరింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హై కమిషన్‌లో పని చేస్తోన్న దౌత్యవేత్తకు సమన్లు కూడా జారీ చేసింది. 26/11 ముంబై దాడులకు సంబంధించిన కేసు విచారణ వేగంగా చేపట్టాలని పాకిస్థాన్‌ను డిమాండ్ చేసింది.
Also Read : Will vaccines work on B.1.1.529. కొత్త కరోనా వేరియంట్‌పై వ్యాక్సిన్లు పనిచేస్తాయా?
ముంబై దాడులు జరిగి 13 ఏళ్లు గడిచినా.. ఇంకా 166 మంది బాధిత కుటుంబాలు న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయని భారత ప్రభుత్వం పేర్కొంది. ముంబైలో ఉగ్రదాడులకు పాల్పడిన వారిని శిక్షించడంలో పాకిస్థాన్ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని భారత విదేశాంగ శాఖ ఆరోపించింది. పాక్.. ద్వంద్వ వైఖరిని వీడాలని భారత్ కోరింది. ముంబై దాడుల దోషుల్ని కఠినంగా శిక్షించాలని కోరింది. ముంబై దాడుల బాధిత కుటుంబాలకు, దాడుల్లో అమరులైన వారికి న్యాయం చేకూరే వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
Also Read : Rakhi Sawant Comments: ఈ నటి విరుష్క జంటకు కండోమ్ గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుందట.. ఎందుకంటే..??
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook