Heavy Rains Alert: ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం త్వరలో వాయుగుండంగా మారనుంది. దాంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే మూడ్రోజులు పెద్దఎత్తున వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పడిన వాతావరణ మార్పుల గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
గత 2-3 రోజుల్నించి ఏపీలోనూ, తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో వాతావరణం మరింత మేఘావృతమైంది. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పుడీ ఆల్పపీడనం వాయగుండంగా బలపడనుందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఫలితంగా రానున్న మూడ్రోజులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడవచ్చని వెల్లడించింది
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడనుండటం వల్ల శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. ఇక రాయలసీమలో మాత్రం వాతావరణం పొడిగానే ఉండవచ్చు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదు కానుంది.
ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలకు సైతం భారీ వర్ష సూచన జారీ అయింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మూడ్రోజులపాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు పడనున్నాయని తెలిపింది.
హైదరాబాద్ నగరంలో ఇప్పటికే భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, ఎస్సార్ నగర్, ఫిల్మ్ నగర్, మాదాపూర్ ప్రాంతాల్లో వర్షం గట్టిగా దంచికొట్టింది. ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు ఇంకా కొనసాగనుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్ ప్రకటించారు.
Also read: Heavy Rains Alert: తెలంగాణలో ముూడ్రోజులు భారీ వర్షాల హెచ్చరిక, ఎక్కడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook