Gang Rape: దారుణం.. భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్ రేప్.. 10 మంది గ్యాంగ్ అరాచకం..

Uttar Pradesh Gang Rape: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ముజఫర్‌నగర్ జిల్లాలో ఓ మహిళ గ్యాంగ్ రేప్‌కు గురైంది. భర్తను చైన్లతో ఓ చెట్టుకు కట్టేసి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2022, 04:03 PM IST
  • యూపీలో వెలుగుచూసిన దారుణం
  • మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన
  • 10 మంది గ్యాంగ్ అరాచకం
Gang Rape: దారుణం.. భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్ రేప్.. 10 మంది గ్యాంగ్ అరాచకం..

Uttar Pradesh Gang Rape: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ముజఫర్‌నగర్ జిల్లాలో ఓ మహిళ గ్యాంగ్ రేప్‌కు గురైంది. భర్తను చైన్లతో ఓ చెట్టుకు కట్టేసి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అత్యాచారానికి పాల్పడినవారిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి మంగళవారం (మార్చి 22) తన భార్య, కుమార్తెను వెంట పెట్టుకుని ముజఫర్‌నగర్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. అక్కడ కాసేపు గడిపిన తర్వాత.. కుమార్తెను అక్కడే ఉంచి భార్యతో కలిసి ఆమె పుట్టింటికి వెళ్లాడు. ఈ క్రమంలో సాయంత్రం సమయంలో అతనికో ఫోన్ కాల్ వచ్చింది. పాప బాగా ఏడుస్తోందని.. వచ్చి తీసుకెళ్లాలని అతని కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో భార్యాభర్తలు ఇద్దరు కలిసి టాక్సీలో అక్కడి నుంచి బయలుదేరారు.

అయితే కొద్ది దూరం వెళ్లాక మరమత్తు పనుల కారణంగా రోడ్డు బ్లాక్ చేసి ఉండటంతో.. టాక్సీ డ్రైవర్ వారిని మధ్యలో దింపేశాడు. దీంతో చేసేదేమీ లేక ఇద్దరు కాలి నడకనే బయలుదేరారు. మార్గమధ్యలో ఓచోట కొంతమంది వ్యక్తులు బైక్స్‌పై వచ్చి వారిని అడ్డగించారు. ఇద్దరిని అపహరించి సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లారు. భర్తను చైన్లతో చెట్టుకు కట్టేసి... అతని కళ్లెదుటే భార్యపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. మొత్తం 10 మంది గ్యాంగ్‌లో ఆమెపై నలుగురైదుగురు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ విషయం బయటకు పొక్కితే చంపేస్తామని వారిని బెదిరించారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

అత్యాచార ఘటనపై తమ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చిన ఆ జంట.. మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 10 మంది నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు తేల్చారు. మైనర్లను జువైనల్ హోమ్‌కి తరలించారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

Also Read: Live in Relationship Certificate: 28 ఏళ్ల యువకుడితో 67 ఏళ్ల మహిళ ప్రేమాయణం.. సహజీవనం కోసం నోటరీ!

Also Read: Stalin Accident Scheme: రోడ్ యాక్సిడెంట్ బాధితులకు సహాయం చేస్తే రూ.5 వేల బహుమానం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x