Karnataka: కర్ణాటక రాజకీయాల్లో మరోసారి వేడెక్కనున్నాయి. టార్గెట్ 2023 దిశగా అమిత్ షా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా నాయకత్వ మార్పు జరగనుందనే వార్తలు విన్పిస్తున్నాయి.
కర్ణాటక రాష్ట్రం గత కొద్దికాలంగా వివిధ అంశాల ఆధారంగా వార్తలకెక్కుతోంది. హిజాబ్ వివాదం అనంతరం హలాల్, లౌడ్ స్పీకర్ల వ్యవహారం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారాయి. మరోవైపు కర్ణాటక రాష్ట నాయకత్వ మార్పు జరగనుందని..బొమ్మై ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవచ్చనే వార్తలు గుప్పుమంటున్నాయి. 2023లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో నాయకత్వ మార్పు చేయకపోతే నష్టమనే ఉద్దేశ్యంతో బీజేపీ అగ్రనాయకత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందంటూ పుకార్లు విస్తరించాయి.
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ రాష్ట్ర పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ ప్రారంభమైంది. అటు బీజేపీ జాతీయ వ్యవహారాల కార్యదర్శి కూడా గుజరాత్లో జరిగినట్టే కర్ణాటకలో నాయకత్వ మార్పు జరిగే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
కర్ణాటకలో ప్రస్తుతం ఉన్నది మూడవ నాయకత్వం. బీజేపీ పరంగా రెండవది. జేడీఎస్ -కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ అధికారం చేపట్టాక యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనపై అసంతృప్తి, విమర్శలు ఎక్కువవడంతో బీజేపీ అధిష్టానం నాయకత్వాన్ని మార్చి..బొమ్మైను ముఖ్యమంత్రిని చేసింది. అయితే నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తల్ని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఖండించారు. అటువంటి అవకాశమే లేదని తేల్చి చెప్పారు. బొమ్మై ముఖ్యమంత్రిగా అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు కూడా. ఏదేమైనా కర్ణాటక టార్గెట్ 2023 దిశగా ఇప్పట్నించే వ్యూహాలు సిద్ధం చేసేందుకు పార్టీ అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల్లో 150 సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్నట్టు సమాచారం.
Also read: Prashanth Kishor: ప్రశాంత్ కిషోర్ పార్టీ వెనుక కేసీఆర్? ప్రత్యామ్నాయ శక్తి ఇదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.