By Election To 13 MLA Seats: దేశవ్యాప్తంగా లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇవి ముగిసి పది రోజులు కూడా పూర్తి కాకముందే దేశంలో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. మళ్లీ ఎన్నికలు ఏమిటా అనుకుంటున్నారా? పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన శాసనసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. దేశంలోని 13 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనుంది.
Also Read: Modi Praises To Pawan: ఢిల్లీలో పవన్ కల్యాణ్ క్రేజ్ చూశారా.. క్లీన్ స్వీప్‌పై మోదీ ప్రశంసలు
దేశంలో అభ్యర్థుల మృతి.. సస్పెండ్ తదితర కారణాల రీత్యా ఖాళీ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ జారీ చేసింది. వాటిని ఖాళీ చేసే బాధ్యతను చేపట్టింది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 4 స్థానాలకు, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, ఉత్తరాఖండ్‌లో 2 స్థానాలు, ఇక పంజాబ్, పశ్చిమ బెంగాల్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ 13 స్థానాలకు జూలై 10వ తేదీన పోలింగ్ చేపట్టేందుకు షెడ్యూల్ విడుదల చేసింది.
Also Read: Women MPs: లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు తీవ్ర అన్యాయం.. ఈసారి గెలిచింది ఎంత మంది అంటే?
14వ తేదీన ఎన్నికల ప్రకటన విడుదల కానుండగా.. 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24l నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణ, 10వ తేదీన పోలింగ్ చేపట్టనున్నారు. జూలై 13వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. 15వ తేదీ వరకు ఉప ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని ప్రకటించింది.
ఉప ఎన్నికలు జరిగే స్థానాలు ఇవే..
రూపాలి (బిహార్), రాయ్‌గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బగడ, మణిక్‌తల (పశ్చిమ బెంగాల్), విక్రవండీ (తమిళనాడు), అమరవార (మధ్యప్రదేశ్), బద్రీనాథ్, మంగ్లౌర్ (ఉత్తరాఖండ్), జలంధర్ పశ్చిమ (పంజాబ్, డెహ్రా, హమీర్‌పూర్, నలఘర్ (హిమాచల్ ప్రదేశ్)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter