Coronavirus Latest Update: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3,095 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 15,208కి చేరింది. 6 నెలల తర్వాత వరుసగా రెండో రోజు 3 వేలకు పైగా కొత్త కోవిడ్-19 కేసులు నమోదవ్వడం గమనార్హం. కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మరణించారు. గోవాలో ఒకరు, గుజరాత్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఒక రోజులో 1390 మంది కరోనాను జయించారు. కోవిడ్-19 ప్రోటోకాల్‌ను పాటించాలని ప్రజలకు కేంద్ర విజ్ఞప్తి చేస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ కింద ఇప్పటివరకు మొత్తం 220.65 కోట్ల డోస్‌లు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో 6,553 డోస్‌ల యాంటీ కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,390 మంది కోలుకోగా.. మొత్తం కరోనాను జయించిన వారి సంఖ్య 4,41,69,711కు చేరుకుంది. కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంటున్నా.. అంతకు మించి పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ప్రజలను ఆందోళన గురిచేస్తోంది.
ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రల్లో కూడా కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా అన్ని ఫ్రంట్‌లైన్ కార్మికులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను 'అలర్ట్ మోడ్'లో ఉంచింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అన్ని పాజిటివ్ నమూనాలను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. లాజిస్టిక్స్, మందులు, పీపీఈ (వ్యక్తిగత రక్షణ పరికరాలు) కిట్లు, గ్లౌజులు, మాస్క్‌లు, ఇతర పరికరాలు, ఆక్సిజన్, ఆసుపత్రులలో కాన్‌సెంట్రేటర్‌ల సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది.
ఢిల్లీలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల దృష్ట్యా.. నగరంలో కోవిడ్ -19 స్థితిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్, సీనియర్ అధికారులు పాల్గొంటారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. కరోనా టెస్టులు పెంచాలని ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణిలను ట్రాక్ చేయాలని సూచించింది. చైనా, సింగపూర్, హాంకాంగ్, కొరియా, థాయిలాండ్, జపాన్ తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం మార్గదర్శకాలు నిర్దేశించింది. విదేశాల నుంచి వచ్చే వ్యక్తులకు ఆర్‌టీసీ టెస్టులో నెగిటివ్ ఉండాల్సిందేనంటూ స్పష్టం చేస్తోంది.
Also Read: Indore Incident: ఘోర విషాదం.. 35 మంది మృతి
Also Read: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపి కబురు.. 8వ వేతన సంఘంపై నిర్ణయం..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook