AICC NEW PRESIDENT: 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి అధ్యక్షుడయ్యారు. అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కర్ణాటకకు చెందిన పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే విజయం సాధించారు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన శశి థరూర్ పై విజయం సాధించారు. ఏఐసీసీ ప్రెడిసెంట్ ఎన్నికల్లో మల్లిఖార్జున ఖర్గేకు 7 వేల 897 ఓట్లు రాగా... శశి థరూర్ కు 1072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లకుండా పోయాయి.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన మల్లికార్జున ఖర్గేకు ట్విట్టర్ ద్వారా శశి థరూర్ శుభాకాంక్షలు చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఖర్గేతో పాటు శశి థరూర్ నిలిచారు. ఈనెల 15వ తేదిన పోలింగ్ జరిగింది. దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ డెలిగేట్లు ఓటటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 96 శాతం పోలింగ్ నమోదైంది.
It is a great honour & a huge responsibility to be President of @INCIndia &I wish @Kharge ji all success in that task. It was a privilege to have received the support of over a thousand colleagues,& to carry the hopes& aspirations of so many well-wishers of Congress across India. pic.twitter.com/NistXfQGN1
— Shashi Tharoor (@ShashiTharoor) October 19, 202
కర్ణాటక రాష్ట్రానికి చెందిన దళిత నేత మల్లికార్జున ఖర్గే ఒకరు. కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఈయన ఒకరు. కర్ణాటకలోని గుల్బర్గా నుంచి 16వ లోక్ సభకు ఎన్నికైన ఖర్గే.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పని చేశారు. రికార్డు స్థాయిలో పది సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తొమ్మిది సార్లు గెలుపొందారు మల్లికార్జున ఖర్గే. ఐదేళ్లు ఎంపీగా పని చేశారు. గుల్బర్బాలోని బుద్ధ విహార్‌ను సిద్ధార్థ్ విహార్ ట్రస్టును స్థాపించి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. బెంగళూరులోని థియేటర్ వేదికల్లో ఒకటైన చౌడియా మెమొరియల్ హాల్ పోషకుడిగా ఉన్నారు. గుల్బార్గాలో ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. 1974 నుంచి 1996 వరకూ తుమ్కూరులోని సిద్ధార్థ్ ఎడ్యుకేషనల్ సొసైటీకి ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి