Centre govt imposes president rule in Manipur: కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. మణిపూర్ లో కొన్నినెలలుగా జాతుల మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణలు పీక్స్ కు చేరాయి. దీన్ని బీరేన్ సింగ్ ప్రభుత్వం ఏమాత్రం అదుపులోకి తీసుకొని రాలేకపోయింది. ఈ ఘర్షణల్లో దాదాపు.. 250మందికి పైగా మరణించినట్లు సమాచారం. దీనిపై ఆయన ఇటీవల నైతిక బాధ్యత వహిస్తు సీఎం పదవికి రాజీనామా చేశారు.
ఈ క్రమంలో తాజాగా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో.. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం నోటిఫికేషన్ ను జారీ చేసింది. అయితే.. మణిపూర్ లో ఇటీవల ఘటనలో మూలంగానే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. బీరేన్ సింగ్ సీఎంగా ఉండటంను సొంతపార్టీ నేతలు సైతం వ్యతిరేకించారు. ఇదిలా ఉండగా..
2023, మేలో రెండు జాతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో దాదాపు 250 మందికిపైగా ప్రజలు మరణించారు. వేలాది మంది తమ గూడు, ఉపాధినికోల్పోయారు. అప్పటి నుంచితరచుగా గొడవలు జరుగుతునే ఉన్నాయి. ఈక్రమంలో క్రమంగా అధికార బీజేపీపై అపోసిషన్ పార్టీలు విమర్శలు తీవ్రతరం చేశాయి.
ఒకవైపు సొంత పార్టీ నేతలు బీరేన్ సింగ్ ను విమర్శించడం, మరోవైపు కాంగ్రెస్ ఇటీవల ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించింది. ఈ క్రమంలో ఆయన ఢిల్లీకి వెళ్లి అమిత్ షా, నడ్డాలను కలిసి సాయంత్రం మణిపూర్ కు వచ్చి గవర్నర్ కు తన రాజీనామాను సమర్పించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధింపు అంశం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter