Centre alerts states over Covid Fourth Wave: కరోనా వ్యాప్తి ఇక తగ్గినట్లేనని అంతా భావిస్తున్న తరుణంలో యూరోప్, చైనా దేశాల్లో వైరస్ ఒక్కసారిగా మళ్లీ విజృంభిస్తోంది. యూరోప్‌లో కోవిడ్ సబ్ వేరియంట్ ఒమిక్రాన్ బీఏ2 కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చైనాలో గురువారం (మార్చి 17) ఒక్కరోజే 2388 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఫోర్త్ వేవ్ రూపంలో ఏ క్షణంలోనైనా కోవిడ్ మళ్లీ విరుచుకుపడవచ్చునే భయాందోళనలు మొదలయ్యాయి. ఈ పరిణామాలతో భారత్ అప్రమత్తమైంది.
కోవిడ్ పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించాలని తాజాగా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కోవిడ్ కట్టడికి ఐదంచెల వ్యూహాన్ని అనుసరించడం తప్పక కొనసాగించాలని సూచించింది. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్-కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు.
గత వారం నుంచి కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. పలు దేశాల్లో కరోనా పరీక్షల సంఖ్య తగ్గిపోయిందని.. ఇది ఆందోళన కలిగించే విషయమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కొత్త కేసులు 8 శాతం మేర పెరిగినట్లు తెలిపింది. మార్చి 7-13 మధ్యలో 11 మిలియన్ల కొత్త కేసులు నమోదయ్యాయని.. 43వేల మంది కరోనాతో మృతి చెందారని వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ కొరియా, చైనాల్లో కొత్త కేసులు 25 శాతం మేర పెరిగాయి. మరణాలు 27 శాతం మేర పెరిగాయి.
ఆఫ్రికాలోనూ కొత్త కేసుల సంఖ్య 12 శాతం, మరణాల సంఖ్య 14 శాతం పెరిగింది. యూరోప్‌లో కోవిడ్ కొత్త కేసుల సంఖ్య 2 శాతం పెరగ్గా.. మరణాల సంఖ్య పెరగలేదు. యూరోప్‌లోని ఆస్ట్రియా, జర్మనీ, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, యూకె తదితర దేశాల్లో కేసులు పెరుగుతుండటంతో... యూరోప్‌లో మరో కోవిడ్ వేవ్ తప్పక పోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Pegasus Spyware: చిక్కుల్లో చంద్రబాబు.. మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు.. పెగాసస్ కొనుగోలు చేశారా?
Also Read: IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. 7.5 కోట్ల పేసర్ ఔట్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook