Uttar Pradesh Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కారు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి చిన్నారి సహా ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం బరేలీ నేషనల్ హైవేపై జరిగింది. కారు టైర్ పంక్చర్ కావడం వల్ల వాహనం అదుపుతప్పి రోడ్డుకు అవతలి వైపుకు వెళ్లి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదం బరేలీ-నైనిటాల్ రోడ్డులోని దుబౌరా గ్రామ సమీపంలో శనివారం అర్థరాత్రి జరిగింది.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి కారులో మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసు సూపరింటెండెంట్ సుశీల్ చంద్రభాన్ తెలిపారు. వీరంతా ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ట్రక్కు డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Onion Exports ban: ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం.. కారణం ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి