How To Control Morning Blood Sugar: మధుమేహం భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధి. ఒక్క సారి ఈ వ్యాధి బారిన పడితే జీవితాంతం ఇది వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి మధుమేహం సమస్యతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు ఇంటి నివారణలు కూడా పాటించాల్సి ఉంటుంది. శరీరంలో రక్త పరిమాణాలు విచ్చలవిడిగా పెరగడం కారణంగా కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెపోటు, కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలో బాధపడేవారు తప్పకుండా పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
రక్తంలో చక్కెర పరిమాణాలను ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం:
మధుమేహం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉల్లిపాయ రసం తాగాల్సి ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారు తప్పకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. ఈ రసాన్ని రోజు ఉదయం పూట తాగడం వల్ల టైప్-1, టైప్-2 మధుమేహం అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ రసం తీసుకోవడం మంచి ఫలితాలు కలుగుతాయి.
ఉల్లిపాయను సలాడ్‌లో తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికే కాకుండా జుట్టు రాలడం, బట్టతల సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఉల్లిపాయను ఉడకబెట్టి రసం తాగడం వల్ల శరీరానికి డిటాక్స్ డ్రింక్‌గా పనిచేస్తుంది. ఈ హోం రెమెడీ శరీరంలోని కేలరీలను తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ఉల్లిపాయ రసం తాగాల్సి ఉంటుంది.
ఉల్లిపాయ రసం తయారి:
ఈ రసం తయారు చేయడానికి ముందుగా ఉల్లిపాయలను మెత్తగా కోయాలి. వాటిని మిక్సర్ గ్రైండర్‌లో వేసి, ఆపై 1 కప్పు నీరు, చిటికెడు నల్ల ఉప్పు, 1 టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న రసాన్ని ప్రతి రోజూ తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook