Home Remedy Viral Fever: సీజన్లు మారిన కొద్దీ కొత్త కొత్త వ్యాధులు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. ప్రస్తుతం వానాకాలం మొదలైంది. దీని కారణంగా వాతావరణంలో తేమ కూడా పెరుగుతుంది. అయితే పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా చాలా మందిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశాలు కూడా అధికమని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని నుంచి కోలుకొవడానికి మందులు వాడుతున్నారు. ఈ మందులతోనే కాకుండా ఇంట్లో ఉండే వస్తువులతో ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇంట్లో లభించే మసాలా దినుసులు కూడా వైరల్ ఫీవర్ నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఏ దినుసులను ఉపయోగించడం వల్ల దీని నుంచి ఉపశమనం లభిస్తుందో తెలుసుకుందాం..
వైరల్ ఫీవర్‌కు ఇంటి చిట్కాలు:
వైరల్ ఫీవర్‌కు తులసి ప్రభావవంతంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. వీటిలో ఉండే గుణాలు శరీరంలో వ్యాపించే ఇన్ఫెక్షన్లను నివారిస్తుందని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది. అయితే మారిగించిన తులసి ఆకుల నీరుతో కూడా వ్యాధుల సంక్రమను నివారించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని కోసం లవంగాల పొడి, తులసి ఆకులను ఒక లీటరు నీటిలో వేసి మరిగించి గంటకొకసారి తాగితే వైరల్ ఫీవర్ గంటలోనే ఉపశమనం లభిస్తుందని నిపణులు తెలుపతున్నారు.
కొత్తిమీర టీ కూడా వైరల్ ఫీవర్‌కు ప్రభావవంతంగా పని చేస్తుంది. అయితే ఇందులో గుణాలు శరీరానికి వ్యాధులు సంక్రమించకుండా కాపాడుతాయి. అంతేకాకుండా వైరల్ ఫీవర్‌ను క్షణాల్లోనే తగ్గిస్తుంది. బరువును నియంత్రించేందుకు వీటిలో మూలకాలు కృషి చేస్తాయి.
పసుపు, సొంఠి కూడా వ్యాధిల నుంచి ఉపశమనం అందిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. పసుపును చాలా మంది యాంటీబెటిక్‌గా వాడుతారు. కావున వీటన్నిటిని టీలాగా చేసుకుని తాగితే వైరల్ ఫీవర్ వంటి సమస్యలు దూరమవుతాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook