Orange Benefits: ప్రకృతిలో లభించే పండ్లలో శరీరానికి కావల్సిన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా కావల్సింది విటమిన్ డి. విటమిన్ డి లోపిస్తే శరీరం, మెదడు రెండింటిపై ప్రభావం పడుతుంది. విటమిన్ డి కోసం ఆరెంజ్ అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది.
విటమిన్ డి అనేది సహజసిద్దంగా సూర్యరశ్మి నుంచి కావల్సినంతగా పొందవచ్చు. సూర్య రశ్మి కాకుండా కొన్ని పండ్లు, కూరగాయల్లో సైతం విటమిన్ డి పెద్దమొత్తంలో ఉంటుంది. దీనికి అద్భుతమైన ప్రత్యామ్నాయం ఆరెంజ్. ఇందులో విటమిన్ సి, విటమిన్ డి పెద్దమొత్తంలో లభిస్తుంది. రోజూ క్రమంగా తప్పకుండా ఆరెంజ్ తీసుకుంటే శరీరానికి కావల్సిన విటమిన్ డి, విటమిన్ సి లభించడమే కాకుండా..నీటి కొరత కూడా ఏర్పడదు. పావు లీటర్ ఆరెంజ్ జ్యూస్ తాగితే 100 ఐయూ విటమిన్ డి శరీరానికి అందుతుంది.
విటమిన్ డి ఎక్కువగా లభించేది నాన్ వెజ్ ఆహారం, డైరీ ఉత్పత్తులు. శాకాహారులకు లేదా డైరీ ఉత్పత్తులంటే ఎలర్జీ ఉండేవారికి సమస్యగా మారుతుంది. ఈ క్రమంలో విటమిన్ డి సమృద్దిగా పొందాలంటే ఆరెంజ్ ఒక్కటే మిగిలిన సరైన ప్రత్యామ్నాయం. విటమిన్ డి శరీరంలో సమృద్ధిగా ఉంటే ఎముకలు బలహీనంగా ఉండవు. గుండె రోగాల్నించి కాపాడుకోవచ్చు. డిప్రెషన్ , చికాకు దూరమౌతాయి. బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
ఆరెంజ్ అనేది ప్రతి సీజన్‌లో లభిస్తుంటుంది. ఇందులో పెద్దమొత్తంలో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడి అజీర్తి సంబంధిత సమస్యలు దూరమౌతాయి. మెటబోలిజం వేగవంతం కావడం వల్ల అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
Also read: Side Effects of Cool Drinks: కూల్ డ్రింక్స్ తాగితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook