Lung Cancer Symptoms: దగ్గు దీర్ఘకాలం వెంటాడితే తేలిగ్గా తీసుకోవద్దు, లంగ్ కేన్సర్ కావచ్చు

Lung Cancer Symptoms: దగ్గు సాధారణమైన సమస్యే. కానీ దీర్ఘకాలం వేధిస్తుంటే మాత్రం కేన్సర్ లక్షణం కావచ్చు. కొన్ని విధానాలతో కేన్సర్, సాధారణ దగ్గు మధ్య తేడాను గుర్తించవచ్చు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 1, 2023, 10:21 PM IST
Lung Cancer Symptoms: దగ్గు దీర్ఘకాలం వెంటాడితే తేలిగ్గా తీసుకోవద్దు, లంగ్ కేన్సర్ కావచ్చు

దగ్గు అనేది ఓ సాధారణ వ్యాధిగానే చాలామంది భావిస్తారు. చలికాలంలో, వర్షకాలంలో దగ్గు, జలుబు సమస్య ఎక్కువగా ఉంటుంది. దగ్గు త్వరగా తగ్గకుండా..ఎక్కువకాలం ఉంటే మాత్రం అప్రమత్తం కావల్సిందే. ఆ వివరాలు మీ కోసం..

చాలామంది దగ్గును తేలిగ్గా తీసుకుంటారు. ఎందుకంటే దగ్గు సమస్య తలెత్తితే కొద్దిరోజుల్లో తగ్గిపోతుంటుంది. కానీ దీర్ఘకాలం ఉంటే మాత్రం అప్రమత్తం కావాలి, లేకపోతే ప్రమాదకరంగా పరిణమించవచ్చు. దీర్ఘకాలం దగ్గు ఉండటం లంగ్ కేన్సర్ కావచ్చు. లంగ్ కేన్సర్ ఉంటే ఎలాంటి ఇబ్బందులుంటాయో తెలుసుకుందాం..

ఊపరితిత్తుల కేన్సర్ ఎలా గుర్తించడం

ఒకవేళ మీకు 3 వారాలు దాటి దగ్గు సమస్య వెంటాడుతుంటే అది లంగ్ కేన్సర్ లక్షణం కావచ్చు. ఇందులో దగ్గుతున్నప్పుడు ఊపిరితిత్తుల్లో నొప్పి వస్తుంది. దాంతోపాటు కఫంతో పాటు రక్తం కూడా వస్తుంది.

ఊపిరితిత్తుల కేన్సర్ లక్షణాలు

ఊపిరితీత్తుల కేన్సర్ ఉంటే ఛాతీలో నొప్పి, దగ్గు, శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బంది, బరువు తగ్గడం, అలసట వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఈ లక్షణాలు కేన్సర్ చివరి దశలో కన్పిస్తాయి.

దగ్గు అనేది లంగ్ కేన్సర్ కాకుండా ఇతర గంభీరమైన వ్యాధులున్నప్పుడు కూడా కన్పిస్తాయి. ఆస్తమా, ఇన్‌ఫెక్షన్, గ్యాస్ట్రో ఓసోఫేగల్ రిఫ్లెక్స్, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మోనరీ డిసీజ్ లక్షణం కావచ్చు. అందుకే దగ్గు ఎక్కువగా ఉంటే నిర్లక్ష్యం వహించవద్దు.

దగ్గు తగ్గించే పద్ధతులు

దగ్గు దీర్ఘకాలం వెంటాడుతుంటే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.  సాధారణ దగ్గు ఉన్నప్పుడు కొన్ని చిట్కాలతో నయం చేసుకోవచ్చు. దగ్గు దూరం చేసేందుకు అల్లం, తులసి, తేనె, నల్ల మిరియాలు, దాల్చినచెక్కతో కాడా చేసుకుని తాగడం ద్వారా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా స్వభావరీత్యా చలవ చేసే వస్తువులకు దూరంగా ఉండాలి.

Also read: Dates Benefits: రోజూ పరగడుపున తీసుకుంటే కలిగే లాభాలు వింటే నోరెళ్లబెట్టాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News