రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ నటించిన 2.0 టీజర్ ఆన్లైన్లో లీక్ అయ్యింది. ఆదివారం ట్విట్టర్లో ఈ వీడియో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని మరల్చింది. భారతీయ చలన చిత్ర రంగ సంస్థ ట్రాకర్ రమేష్ బాల అధికారిక విడుదలకు ముందే టీజర్ లీక్ కావడం విస్మయానికి గురిచేసిందని ట్వీట్ చేశాడు.
Shocking to know #2point0Teaser is leaked on-line.. Hope the team takes strict action on the culprits..
Usually, the team releases the official teaser immediately to contain the damage..
Not sure, if the teaser is fully ready now or if the timing is right to release it now..
— Ramesh Bala (@rameshlaus) March 4, 2018
కాగా.. రజనీతో పాటు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సీన్లతో, డైలాగులతో కూడిన వీడియోను ఎవరో విడుదల చేశారు. ఇదే 'టీజర్ లీక్' అంటూ '2.0'లోని కొన్ని సన్నివేశాలను ఈ ఉదయం విడుదల చేయడంతో చిత్ర యూనిట్‌కి షాక్ తగిలింది. ఇక ఈ సినిమా సీన్లు యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ఛానళ్లలో వైరల్ అవుతుండటంతో, నిర్మాతల ఫిర్యాదు మేరకు వాటన్నింటినీ యూట్యూబ్ తొలగించింది. చాలా లింక్స్ లో ఈ వీడియో రాకపోయినా, అప్పటికే డౌన్ లోడ్ చేసుకున్న వందలాది మంది తిరిగి పోస్టులు చేస్తున్నారు. దీని వెనక ఉన్న మోసగాళ్లను పట్టుకోవాలని చిత్ర యూనిట్ పోలీసులను కోరింది.
శంకర్ దర్శకత్వం వహించిన రోబో సినిమాకు సీక్వెల్ ఈ 2.0 మూవీ. 2.0 తమిళంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించడం ఇదే తొలిసారి. రజినీకాంత్‌తో కలిసి నటించడం కూడా ఇదే అక్షయ్‌కు మొదటిసారి. ఈ చిత్రంలో ఆదిల్ హుస్సేన్, సుధాన్షు పాండే కూడా నటించారు. చిత్ర నిర్మాతలు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కొన్ని వారాల క్రితం దుబాయిలో ఘనంగా ఫంక్షన్ నిర్వహించి ఆడియోను విడుదల చేశారు.
ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. సినిమా అంచనా బడ్జెట్ రూ.400 కోట్లు దాటిపోయింది. భారతదేశం ఇప్పటివరకు చేసిన అత్యంత ఖరీదైన చిత్రాలలో ఇది ఒకటి. అకాడమీ అవార్డు గెలుచుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా..నిరవ్ షా సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.