Best Selling Cars in India 2023: మారుతి సుజుకి కార్లకు ఎంత క్రేజ్, ఆదరణ ఉందంటే అత్యధికంగా విక్రయమయ్యే టాప్ 10 కార్లలో 6 తప్పకుండా మారుతి సుజుకి కంపెనీవే అయుంటాయి. విశేషమేమంటే మారుతి సుజుకి కార్లే ఒకదానికొకటి పోటీ పడుతుంటాయి.
మారుతి సుజుకికు చెందిన స్విఫ్ట్, వేగన్ ఆర్ కార్లు చాలా ప్రాచుర్యం పొందాయి. అత్యధిక విక్రయాలు జరుపుకుంటూ అగ్రస్థానంలో ఉండేవి. కానీ మే నెలలో మాత్రం మారుతి సుజుకికు చెందిన మరో మోడల్ కారు ఈ రెండు కార్లను వెనక్కి నెట్టేసింది. అదే మారుతి సుజుకి బలేనో. ఇప్పుడు మారుతి సుజుకి కంపెనీ కార్లలో బెస్ట్ సెల్లింగ్ కారు ఇదే. దేశవ్యాప్తం విక్రయాల్లో బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలుస్తోంది.
మే 2023లో మారుతి బలేనో అత్యధికంగా విక్రయమైంది. మే నెలలో ఏకంగా 18,700 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ తరువాత రెండవ స్థానంలో ఉంది మారుతి స్విఫ్ట్. ఇక మారుతి వేగన్ ఆర్ మూడవ స్థానంలో ఉంది. మే నెలలో మారుతి స్విఫ్ట్ అమ్మకాలు 17,300 యూనిట్లు కాగా వేగన్ ఆర్ 16,300 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. అంటే మే నెలలో టాప్ 3 బెస్ట్ సెల్లింగ్ కార్లతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నవి మారుతి సుజుకి కంపెనీ కార్లే. మార్కెట్‌లో మారుతి కంపెనీ కార్లకు ఉన్న క్రేజ్ ఇదే.
Also Read: PM Modi US Visit: ప్రధాని మోదీకి జో బైడెన్ స్పెషల్ టీషర్ట్ గిఫ్ట్.. దానిపై ఏం రాశారంటే..?
మే నెలలో అత్యధిక విక్రయాలు జరిపిన టాప్ 10 కార్లు
1. మారుతి బలెనో 18,700 యూనిట్లు
2. మారుతి స్విఫ్ట్ 17,300 యూనిట్లు
3. మారుతి వేగన్ ఆర్ 16,300 యూనిట్లు
4. హ్యుండయ్ క్రెటా 14,449 యూనిట్లు
5. టాటా నెక్సాన్ 14,423 యీనిట్లు
6. మారుతి బ్రెజా 13,398 యూనిట్లు
7. మారుతి ఈకో 12,800 యూనిట్లు
8. మారుతి డిజైర్ 11,300 యూనిట్లు
9. టాటా పంచ్ 11,100 యూనిట్లు
10. మారుతి ఎర్టిగా 10,500 యూనిట్లు
మారుతి బలేనో ధర మార్కెట్‌లో 6.61 లక్షల నుంచి ప్రారంభమై 9.98 లక్షల వరకూ ఉంటుంది. 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌తో లభ్యమౌతోంది. ఇందులో సీఎన్జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మారుతి బలేనో ఇంజన్ పెట్రోల్‌పై 90 పీఎస్ పవర్, 113 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే సీఎన్జీపై అయితే 77.49 పీఎస్ పవర్, 98.5 ఎన్ఎం టార్క్ ఉప్త్తి చేస్తుంది. మారుతి సుజుకి బలేనో కారుల 5 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్, 5 స్పీడ్ ఏఎంటీ ఆప్షన్ కూడా ఉంది. ఇంజన్‌తో పాటు ఐడల్ స్టార్ట్, స్టాప్ టెక్నాలజీ కూడా ఉంది. ఫలితంగా మైలేజ్ బాగుంటుంది.
Also Read: Most Expensive Water: ఎప్పుడైనా లక్షలు విలువ చేసే నీటిని చూసారా? చూడకపోతే తప్పకుండా ఇప్పుడు చూడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook