Hyundai Creta @ Rs 8 Lakhs Only: ఎస్‌యూవీల్లో అధిక ప్రాచుర్యం పొందింది. ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నది హ్యుండయ్ క్రెటా. హ్యుండయ్ కంపెనీ కార్లతో అత్యధికంగా విక్రయమయ్యేది కూడా ఈ కారే. ఇండియాలో హ్యుండయ్ విక్రయాల్లో మేజర్ షేర్ హ్యుండయ్ క్రెటాదే కావడం విశేషం. ధర మాత్రం సామాన్యుడి బడ్జెట్ కంటే ఎక్కువే.
హ్యుండయ్ క్రెటా ప్రారంభ ధర 10.87 లక్షల నుంచి ప్రారంభమై 19.20 లక్షల వరకూ ఉంటుంది. అంతేకాకుండా హ్యుండయ్ క్రెటా కోసం వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. బడ్జెట్ తక్కువ, వెంటనే డెలివరీ కావాలంటే పాత క్రెటా కొనుగోలు మంచి ఆప్షన్ కాగలదు. ఎందుకంటే హ్యుండయ్ క్రెటా సెకండ్ హ్యాండ్ కార్లు కార్స్ 24లో చాలా అందుబాటులో ఉన్నాయి. ధర కేవలం 8 లక్షల రూపాయలే. అంటే 8 లక్షలు చెల్లించి మీక్కావల్సిన హ్యుండయ్ క్రెటాను ఇంటికి తీసుకెళ్లవచ్చు. కార్స్ 24 లో ఉన్న కొన్ని హ్యుండయ్ క్రెటా కార్ల గురించి తెలుసుకుందాం..
హ్యుండయ్ క్రెటా ఇ ప్లస్ 2017 మోడల్ 1.6 పెట్రోల్ మేన్యువల్ 7.99 లక్షలకు అందుబాటులో ఉంది. ఈ కారు 47,556 కిలోమీటర్లు ప్రయాణించింది. ఫస్ట్ ఓనర్ ఆధీనంలో ఉండటమే కాకుండా ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో నోయిడా సెక్టార్ 18లో ఉంది.
ఇక మరో హ్యుండయ్ క్రెటా కారు 2016 మోడల్ ఎస్ఎక్స్ ప్లస్ 1.6 పెట్రోల్ మేన్యువల్ 7.91 లక్షలుంది. ఈ కారు 45,050 కిలోమీటర్లు తిరిగింది. ప్రస్తుతం సెకండ్ ఓనర్ ఆధీనంలో ఉన్న ఈ కారు రిజిస్ట్రేషన్ ఢిల్లీతో ఉంది. నోయిడా సెక్టార్ 18లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఈ కారు కావాలంటే నేరుగా ఓనర్‌తో మాట్లాడుకుంటే ధర మరింత తగ్గవచ్చు.
హ్యుండయ్ క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ 1.6 పెట్రోల్ మేన్సవల్ 8.16 లక్షలు పలుకుతోంది. ఈ కారు ఇప్పటి వరకూ 1,05,384 కిలోమీటర్లు తిరిగింది. ఇది కూడా సెకండ్ ఓనర్ కారు. రిజిస్ట్రేషన్ ఢిల్లీ, నోయిడా సెక్టార్ 75లో అందుబాటులో ఉంది.
హ్యుండయ్ క్రెటా 2017 మోడల్ ఇ ప్లస్ 1.6 పెట్రోల్ మేన్యువల్ 7.84 లక్షలకు లభిస్తోంది. ఇది కూడా సెకెండ్ ఓనర్ ఆధీనంలో ఉంది. మొత్తం 22,591 కిలోమీటర్లు నడిచింది. రిజిస్ట్రేషన్ నెంబర్ హర్యానా రాష్ట్రానిది. ఢిల్లీలోని రోహిణిలో విక్రయానికి సిద్ధంగా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook