Revanth Reddy: అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 విడదల సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ పరిణామాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సినిమా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలపై తీసుకున్న నిర్ణయం టాలీవుడ్‌ను షాక్ గు గురి చేసింది. ఇవాళ జరిగిన భేటీలో కూడా అదే విషయం స్పష్టం చేయడంతో తెలుగు సినీ పరిశ్రమకు గట్టి దెబ్బే తగిలింది.
అల్లు అర్జున్ అరెస్ట్ పరిణామాలు తెలంగాణాలో తీవ్ర మార్పులకు కారణమైంది. ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రత్యేక షోలు, టికెట్ పెంపు ఉండదని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. దాంతో షాక్ తిన్న సినిమా పెద్దలు హుటాహుటిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు నిర్ణయించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి తెలుగు సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెరవెనుక నుంచి అంతా నడిపించిన చిరంజీవి భేటీకి దూరంగా ఉన్నారు. ఈ భేటీలో సమస్య పరిష్కారమౌతుందని ఆశించి భంగపడ్డారు.
ఎందుకంటే తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఉండదన్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇప్పుడీ ప్రభావం రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలపై పడనుంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. వీటితో పాటు భవిష్యత్తులో విడుదల కానున్న సినిమాలుపై ఇదే ప్రభావం పడనుంది. ఇప్పుడు తెలుగు సినీ ప్రముఖులకు ఏం చేయాలో తోచడం లేదు.
ఈ సమస్య ఇప్పుడు తెలంగాణ ఒక్క రాష్ట్రానికి పరిమితమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. ఏపీపై కూడా పడవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ప్రత్యేక షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ పెంపుకు అనుమతి లేదు. ఏపీలో మాత్రం ఈ పరిస్థితి లేదు. ప్రత్యేక షో, బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభావం ఏపీ పాలకులపై పడే అవకాశాలున్నాయి. తెలంగాణలో టికెట్ పెంపు లేనప్పుడు ఏపీలో మాత్రం ఎందుకనే విమర్శలు రావచ్చు. రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని చంద్రబాబు కూడా ఫాలో కావల్సిందేనా అనే చర్చ నడుస్తోంది.
సంక్రాంతికి వస్తున్న భారీ చిత్రాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. దీంతో పాటు బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ కూడా ఉంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అనుమతిస్తే ప్రజల నుంచి లేకుంటే సినీ ప్రముఖుల నుంచి విమర్శలు ఎదుర్కోవల్సిందే
Also read: DA Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్, జనవరి నుంచి భారీగా జీతం పెంపు ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.