Sandhya Theatre about Allu Arjun Issue: అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప2. విడుదలైన వారంలోపే రూ.1000 కోట్ల క్లబ్లో చేరింది. కానీ ఆ సంతోషం ఒక్కరోజు కూడా లేకుండా పోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అల్లు అర్జున్ డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో వేసిన బెనిఫిట్ షో కి అభిమానులతో కలిసి చూడాలని సినిమా థియేటర్ కి వచ్చారు. అయితే అక్కడికి అల్లు అర్జున్ రావడంతో ఆయనను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు.
ఆ తొక్కిసలాటలో సినిమా చూడడానికి వచ్చిన రేవతి అనే 39 సంవత్సరాల మహిళ అక్కడికక్కడే మరణించగా ఆమె కొడుకు స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆ బాలుడిని హాస్పిటల్ కి తరలించగా ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఇకపోతే మొదటి రోజే మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ పై , సంధ్య థియేటర్ యాజమాన్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి పబ్లిక్ ఫిగర్..పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా పబ్లిక్ లోకి వస్తారు ?అంటూ విమర్శలు గుప్పించారు.
దీనికి తోడు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా.. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు వస్తున్నప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలి.. ముందే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా..అంటూ కూడా కామెంట్ లు చేశారు. అయితే ఎందుకో ఈ విషయాలు ఇంతగా వైరల్ అవుతున్నా అప్పుడు సంధ్య థియేటర్ యాజమాన్యం స్పందించలేదు.
కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ని ఇదే కేసులో అరెస్ట్ చేయడంతో ఎట్టకేలకు అసలు విషయాన్నీ బయటపెట్టింది సంధ్యా థియేటర్ యాజమాన్యం. హైదరాబాదులోని పోలీస్ కమిషనర్ ఆఫీస్ కు డిసెంబర్ రెండవ తేదీని వినతి పత్రం పంపింది. డిసెంబర్ 4 5వ తేదీలలో బెనిఫిట్ షోలతో పాటు షో కూడా వేయబోతున్నాము. ఈ థియేటర్ కి హీరో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక మందన్న అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నారు.
క్రౌడ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నామంటూ ఒక లేఖ కూడా పంపించినట్లు తాజాగా మీడియాకు రివీల్ చేసింది సంధ్య థియేటర్ యాజమాన్యందీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి లేఖ పంపిన కూడా ఎందుకు కమిషనర్ స్పందించలేదు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో చర్చిస్తున్నారు.
ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి