Salaar: నేపాల్ బ్లైండ్ సింగర్…పట్టించుకోని బాలీవుడ్..సలార్ తో లైఫ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..

Nepal Blind Singer Menaka: ఇండియన్ ఐడల్ లో మేనక అనే అమ్మాయికి మన యానిమల్ హీరో రణబీర్ కపూర్ కాళ్లు మొక్కిమరి మెచ్చుకున్న సంగతి చాలామందికి తెలిసి ఉంటుంది. కాగా అలాంటి ఆ గాయనికి బాలీవుడ్ వారి కన్నా ముందుగా ఛాన్స్ ఇచ్చారు మన ప్రశాంత్ నీల్..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2023, 10:39 AM IST
Salaar: నేపాల్ బ్లైండ్ సింగర్…పట్టించుకోని బాలీవుడ్..సలార్ తో లైఫ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..

Salaar Collections: డిసెంబర్ 22న విడుదలైన సలార్ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎన్నో సంవత్సరాల తరువాత ప్రభాస్ కి సూపర్ హిట్ రావడంతో అభిమానులు తెగ సందడి చేసుకుంటున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరి పర్ఫామెన్స్ ఎంతో బాగుంది అని సాధారణ ప్రేక్షకులు సైతం ఈ చిత్రాన్ని ఇక ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ని మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ప్రస్తుతం మరో వార్త కూడా తెగ వైరల్ అవుతుంది.

అదేమిటి అంటే ఈ సినిమాలో నేపాల్ కి చెందిన బ్లైండ్ సింగర్ మేనుకా పౌదేల్ ఓ పాట పాడారు. కాగా హిందీలో ప్రచారమయ్యే ప్రముఖ సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ చూసేవారికి ఈమె గురించి పరిచయాలు అవసరం లేదు. ఇండియన్ ఐడల్ సీజన్ 14  తో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు మేనుకా పౌదేల్. అక్కడ జరిగిన ఎంతో టఫ్ కాంపిటీషన్ మధ్య ఎంతో మంది కంటెస్టెంట్లను దాటుకొని ఆమె తన మార్క్ చూపించారు.

 

నేపాల్ కి చెందిన ఈ అమ్మాయి పుట్టుకతో  బ్లైండ్ అయినా కానీ తన టాలెంట్ తో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. ఇక ఇండియన్ ఐడల్ లో పాల్గొన్న టైమ్ లో మేనుకా పాడిన ఓ పాటకు మెస్మరైజ్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్.. ఆమె పాదాలకు నమస్కరించడం గమనార్హం. తనకు శ్రేయా ఘోషల్ పాటలంటే అంటే ఎంతో ఇష్టమని.. కానీ ఆమె తరువాత ఇప్పుడు మళ్లీ సింగింగ్ లో మరో దేవతను చూస్తున్నానంటూ మేనుకాను ఈ హీరో ఆకాశానికి ఎత్తేశారు. అలాంటి మేనుకాకు ‘సలార్’తో లైఫ్ ఇచ్చారు క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

ఎంతో పేరు తెచ్చుకున్న ఆమెకు మొదటగా బాలీవుడ్ వారు ఎవ్వరు ఛాన్స్ ఇవ్వలేదు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం సలార్ హిందీ వర్షన్ లో పాట పాడడానికి ఈ అమ్మాయిని తీసుకున్నారు. తెలుగులో సూరీడే సూరీడే‌ అంతు సలార్లో సాగే హిందీ వెర్షన్‌ నా మేనక పాడారు. ఇక ఈ సాంగ్ హిందీలో చార్ట్ బస్టర్ గా నిలిచింది. తెలుగు పాటకు దీటుగా హిందీ వెర్షన్ను ఆలపించి ప్రేక్షకుల మనసులను మరోమారు దోచుకున్నారు మేనుకా. ఇలా మొట్టమొదటి సినిమా చాన్స్ మేనకాకి ప్రశాంత్ నీల్ ఇచ్చి తనకు సినిమాల్లో లైఫ్ ఇచ్చాడు. ముఖ్యంగా హిందీ రియాలిటీ షోస్ ద్వారా పాపులరైన గాయనికి బాలీవుడ్ కంటే ముందు మన సౌత్ దర్శకుడు ఆఫర్ ఇచ్చి ఆమెకు మంచి బ్రేక్ ఇవ్వడం గొప్ప విషయమని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. 

Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు

Also read: India Covid Cases Today: ఒక్క రోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మొత్తం ఎన్ని కేసులంటే..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News