సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ( Sushant Singh Rajput death case ) అరెస్ట్ అయిన అతడి ప్రియురాలు రియా చక్రవర్తికి కోర్టులో చుక్కెదురైంది. రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ( NCB ) విభాగం.. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆమెని కోర్టులో హాజరుపర్చింది. ఈ సందర్భంగా రియా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ముంబై కోర్టు ఆమె బెయిల్ పిటిషన్‌ని ( Rhea Chakraborty's bail petition ) తిరస్కరిస్తూ 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. Also read : Director Surya Kiran: బిగ్ బాస్ కంటెస్టెంట్ సూర్యకిరణ్ ఎవరో తెలుసా ?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె కుటుంబసభ్యులే తన కొడుకు మృతికి కారణం అయ్యారంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ చేసిన ఫిర్యాదుతోనే పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం ఈ కేసు విచారణ సీబీఐ పరిధికి బదిలీ అయ్యింది. సీబీఐ విచారణ జరుగుతున్న క్రమంలోనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం రియా చక్రవర్తి తన సోదరుడు షోవిక్ చక్రవర్తి ( showik Chakraborty ) ద్వారా డ్రగ్స్ ( Drug abuse ) కొనుగోలు చేసినట్టు ఆరోపణలు రావడంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆ దిశగా విచారణ చేపట్టి ఆమెను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. Also read : Antarvedi radham issue: అంతర్వేది రథం దగ్ధం.. సర్కారుపై పవన్ ఘాటు వ్యాఖ్యలు
మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం..
- Bangaru Thalli Trailer: ఉత్కంఠరేపుతున్న బంగారు తల్లి ట్రైలర్
- Bigg Boss Telugu 4 contestant Gangavva: గంగవ్వ ఎవలు, బిగ్ బాస్ 4 షోలోకి ఎట్లొచ్చింది ?
- Gangavva in BB4: బిగ్ బాస్ రియాలిటీ షోలో గంగవ్వ డైలాగ్స్ కెవ్వు కేక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR