Jani Master Bail: అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ కు అవకాశాల ఆశ చూపి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసిన నేరంలో జానీ మాస్టర్ ను పోలీసులు సినీ ఫక్కీలో గోవాలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ కేసులో పోలీసుల రిమాండ్ లో చంచల్ గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్ కు కోర్టు 4 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తాజాగా కేంద్రం ప్రకటించిన జాతీయ చలన అవార్డుల్లో జానీ మాస్టర్ కు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డు వరించిన సంగతి తెలిసిందే కదా. ఈ అవార్డులు ఈ నెల 8న రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ అవార్డు అందుకోవడానికి ఆయన ఢిల్లీ వెళ్లాలని తన బెయిట్ పిటిషన్ లో పేర్కొన్నారు. నిన్న బెయిల్ పై వాదనలు ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా 14 రోజులు రిమాండ్ తర్వాత ఈ నెల 6 నుంచి 10 వరకు జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఇచ్చింది. .
అయితే.. జానీ మాస్టర్ కేసులో నిందితుడే కానీ.. ఆయన దోషి గా కోర్టు నిర్ధారించలేదు. దీంతో రంగారెడ్డి కోర్టు నాలుగు రోజులు నిమిత్తం (అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 10) వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా జానీ మాస్టర్.. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరిని ప్రభావితం చేయకూడదనే షరుతులతో బెయిల్ మంజూరు చేసింది.
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
ఇప్పటికే పోలీసులు జానీ మాస్టర్ కు వ్యతిరేకంగా పలు సాక్ష్యాలను సేకరించారు. అంతేకాదు అతనికి కొత్తగా ప్రవేశపెట్టిన పలు సెక్షన్ల కింద దాదాపు 14 యేళ్ల నుంచి యావజ్జీవిత ఖైదు విధించే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో జానీ మాస్టర్ వల్ల ఇబ్బందుల పాలైన ఒక్కొక్కుగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను వివరిస్తున్నారు.
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే జానీ మాస్టర్ తాను చేసిన తప్పును కోర్టులో ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ వల్ల ఇబ్బందుల పాలైన వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ కేసులో జానీ మాస్టర్.. తాను తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను పలుమార్లు అత్యాచారం చేసినట్టు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
జానీ మాస్టర్ 2017 లో ఒక ప్రోగ్రామ్ లో పరిచయమైన యువతిని తన టీమ్ లోకి అసిస్టెంట్ గా జాయిన్ చేసుకున్నారు.
2020లో దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలోని ఒక హోటల్లో గదిలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు అంగీకరించాడు. అప్పటికీ ఆమె మైనర్ కావడంతో జానీ మాస్టర్ పై పోక్సో సహా పలు కేసులు పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే కదా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.