చిత్రం: రామం రాఘవం (Ramaam Raaghavam)
నటీనటులు: ధన్ రాజ్, సముద్రఖని, ప్రమోదిని, సత్య, హరీష్ ఉత్తమన్, పృథ్వీరాజ్, సునీల్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
సంగీతం: అరుణ్ చిల్లివేరు
సినిమాటోగ్రఫీ: దుర్గా ప్రసాద్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
కథ: శివప్రసాద్ యానాల
నిర్మాతలు: పృథ్వీ పోలవరపు
దర్శకత్వం: ధన్ రాజ్
విడుదల తేది: 21-2-2025
తెలుగులో హాస్య నటుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధన్ రాజ్. జబర్ధస్త్ తో పాటు పలు కామెడీ షోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా దర్శకుడిగా మారి ‘రామం రాఘవమ్’ సినిమాను తెరకెక్కించాడు. సముద్రఖని ముఖ్యపాత్రలో .. ధన్ రాజ్ మరో కీ రోల్ పోషించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
దశరథ రామం (సముద్రఖని) నిజాయితీ గల సబ్ రిజిస్ట్రార్. కుమారుడు రాఘవ (ధన్ రాజ్) అంటే అమితమైన ప్రేమ. కొడుకును అతి గారాబం చేయడంతో చెడు వ్యసనాలకు బానిస అవుతాడు. ఈ క్రమంలో డబ్బు సంపాదన కోసం చేసిన తప్పుడు పని చేస్తాడు. దీంతో తండ్రే స్వయంగా అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకొని అతన్ని చంపాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో లారీ డ్రైవర్ దేవ (హరీష్ ఉత్తమన్) తో తండ్రి హత్య చేయాలని డీల్ చేసుకుంటాడు. అమితంగా ప్రేమించిన తండ్రిని ఎందుకు చంపాలనుకున్నాడు. చివరకు హత్య చేయాలనుకున్న తన పథకాన్ని ఎగ్జిక్యూట్ చేసాడా.. ? లేదా ? చివరకు ఏం అయిందనేది ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
పిల్లలకు తండ్రి పేరు ఇవ్వగలడు కానీ... మంచి పేరు ఇవ్వలేడనే చిన్న పాయింట్ తో ఈ సినిమా కథను రాసుకున్నాడు ధన్ రాజ్. ఇప్పటి తరంలో తల్లిదండ్రులు పిల్లలను క్రమశిక్షణలో ఉంచాలనుకున్నా.. వారు మాత్రం చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. అంతేకాదు రక్తం పంచుకు పుట్టిన వాళ్లను డబ్బు కోసం కడతేరుస్తున్నాడు. ఈ పాయింట్ చుట్టే ఈ సినిమా కథను అల్లు కున్నాడు ధన్ రాజ్. ఇలాంటి రామం, రాఘవం లాంటి పాత్రలను మన చుట్టు రోజు చూస్తేనే ఉంటాము. ముఖ్యంగా కుమారుడు చెడు వ్యసనాలకు బానిసైనపుడు మాములు తండ్రి ఎలాంటి బాధను అనుభవిస్తాడనేది సముద్రఖని పాత్రలో చూపించాడు. దర్శకుడు కమ్ హీరో ముఖ్యపాత్రలో ధన్ రాజ్.. తన చెడు వ్యసనాల కారణంగా తండ్రిని ఓ చిన్న కారణంతో చంపాలనుకునే పాయింట్. చివవరకు ఏమైవుతుందనేది ప్రేక్షకులను ఉత్కంఠకు రేపాడు. మొత్తంగా తండ్రీ కొడుకుల చుట్టే గిరీ గీసుకొని తిరిగే స్టోరీ. కొంచెం రొటీన్ అనిపించినా.. ఇప్పటి తరం ఎలా బిహేవ్ చేస్తుందనే దాన్ని ఈ సినిమాలో చూపించాడు ధన్ రాజ్. ముఖ్యంగా తండ్రీ తనయలు సంఘర్షణ ఈ సినిమాకు మెయిన్ పాయింట్. గతంలో ‘సంసారం ఒక చదరంగం’, సూరిగాడు వంటి చిత్రాలు జ్ఞాపకం వస్తాయి. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీతో పాటు నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి. ఆర్ఆర్ సందర్భోచితంగా ఉంది. ఒక చిన్న పాయింట్ చుట్టూ.. ఓ సీరియల్ మాదిరిగా ఉండటం కాస్త బోరింగ్ కలిగించే అంశమనే చెప్పాలి. ముఖ్యంగా దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ఇలాంటి కరెంట్ ఇష్యూను ఎంచుకోవడం అభినందించదగ్గ విషయం.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
నటీనటుల విషయానికొస్తే..
నిజాయితీ గల తండ్రి పాత్రలో సముద్రఖని జీవించాడు. తను ఎంత మంచి నటుడో ఈ సినిమాలో చూపించాడు. ధన్ రాజ్ కూడా తన పాత్రలో జీవించాడు. తానే దర్శకుడు కావడం ఈ సినిమాకు ఎస్సెట్. కమెడియన్ గా తన పరిధి ఏంటో తెలుసుకొని తనకు తగ్గ సీన్స్ లో రాణించాడు. సత్య ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేసాడు. మిగిలిన నటీనటులు తన పరిధి మేరకు రాణించారు.
పంచ్ లైన్.. ‘రామం రాఘవం’..మెప్పించే తండ్రీ కొడుకుల ఎమోషనల్ డ్రామా..
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.