Pushpa OTT Deal: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప ది రైజ్'. డిసెంబరు 17న థియేటర్లలో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కొల్లగొడుతోంది. అయితే ముందుకు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ మూవీని ఓటీటీని రిలీజ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ సిద్ధమైంది.
డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా శుక్రవారం నుంచి (జనవరి 7) తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. హిందీ వెర్షన్ మాత్రం ఆలస్యంగా స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ దక్షిణ భారత భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఇక్కడ ‘పుష్ప’తో అమెజాన్ ప్రైమ్ డీల్ గురించి ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పుష్ప పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ 22 కోట్ల రూపాయలను చెల్లించిందని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమాను ఇంత త్వరగా మేకర్స్ డిజిటల్ గా ప్రసారం చేయడం గమనార్హం.
సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప' చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా సెకండ్ పార్ట్ ను 'పుష్ప 2' చిత్రీకరణను మార్చి నుంచి ప్రారంభించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ సీక్వెల్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను సుకుమార్ ప్రారంభించాడు. 'పుష్ప 2'పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ సెకండ్ పార్ట్ ను డిసెంబర్ 2022 లో విడుదల చేయాలని భావిస్తున్నారు.
Also Read: Mouni Roy Beach Photo: బీచ్ లో అందాలతో బుసలు కొడుతున్న 'నాగిని' మౌనీ రాయ్
Also Read: RRR Movie: 'ఆర్ఆర్ఆర్'కు మరో ఎదురుదెబ్బ.. సినిమా విడుదల ఆపాలంటూ హై కోర్టులో పిల్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.