BRO Twitter Review: బ్రో ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఇదే.. పవన్ స్టామినాకు తగ్గట్లే..!

Pawan Kalyan BRO Movie Review And Public Talk: థియేటర్ల వద్ద పవర్ స్టార్ ఫ్యాన్స్ సందడి మొదలైంది. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో పవన్ కళ్యాణ్ కలిసి నటించిన బ్రో సినిమా నేడు బాక్సాఫీసు ముందుకు వచ్చింది. ట్విట్టర్‌ పబ్లిక్ టాక్ ఎలా ఉంది..? ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది..?  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 28, 2023, 11:04 AM IST
BRO Twitter Review: బ్రో ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఇదే.. పవన్ స్టామినాకు తగ్గట్లే..!

Pawan Kalyan BRO Movie Review And Public Talk: బాక్సాఫీసు వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ సినిమా వస్తుందంటే.. వారం రోజుల ముందు నుంచే థియేటర్ల వద్ద హంగామా మొదలవుతుంది. అలాంటిది ఇద్దరు మెగా హీరోలు కలిసి నటించిన సినిమా అంటే.. థియేటర్ల వద్ద ఏ రేంజ్‌లో జాతర ఉంటుందో మీరే ఊహించుకోండి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన మూవీ 'బ్రో'. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కేతికా శర్మ, ప్రియా వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన వినోదయ సీతం చిత్రానికి రీమేక్ ఇది. తమిళంలో కూడా సముద్రఖని దర్శకత్వం వహించి నటించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ ప్లే అందించాడు. భారీ అంచనాల నడుమ నేడు (జూలై 28) ఆడియన్స్ ముందుకు రానుంది. ట్విట్టర్‌ ఆడియన్స్ టాక్ ఎలా ఉందో చూద్దాం..

ఫస్ట్ హాఫ్‌లో డైలాగ్స్, స్క్రీన్‌ ప్లే బాగుందని అంటున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ బాగుందని చెబుతున్నారు. తమన్ బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. పవన్, తేజ్‌ కాంబో సూపర్ సెట్ అయిందని ట్వీట్స్ చేస్తున్నారు. ఓవరాల్‌గా సినిమా కొన్ని మంచి సీన్లు ఉన్నాయని.. కానీ మొత్తం మీద తడబడిందని మరికొందరు అంటున్నారు. కామెడీ హైలెట్‌గా ఉన్నాయని.. పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ రేంజ్ మూవీ అని చెబుతున్నారు. భావోద్వేగాలతో పెద్దగా కనెక్ట్ కావని రివ్యూ ఇస్తున్నారు. 

 

 

"నాలాంటి అభిమానులందరికీ నా మాటలను గుర్తు పెట్టుకోండి. ఇది పూర్తి పవర్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. స్క్రీన్‌పై సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తుంది. కుటుంబ సభ్యులను బాధ్యతగా భావించే వారందరికీ కచ్చితంగా ఈ చిత్రం నచ్చుతుంది. పవన్ కళ్యాణ్ టైమింగ్.. సాయి ధరమ్ తేజ్ మార్క్ సినిమా అంతటా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మనందరినీ భావోద్వేగానికి గురిచేస్తాడు దర్శకుడు సముద్రఖని. త్రివిక్రమ్ స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్ చాలా బాగున్నాయి. చిత్రబృందం చాలా బాగా పని చేసింది.." అని ఓ అభిమాని రివ్యూ ఇచ్చాడు. 

 

 

 

 

 

 

 

మొత్తానికి బ్రో మూవీకి పాజిటివ్ టాక్స్ వస్తుండడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ల భారీగా సందడి చేస్తున్నారు. మరి కాసేపట్లో మూవీ ఒరిజినల్ రివ్యూ రాబోతుంది.

Also Read: PM Kisan 14th Installment: గుడ్‌న్యూస్.. అకౌంట్‌లోకి డబ్బులు జమ.. మీ పేరు ఇలా చెక్ చేసుకోండి

Also Read: Revanth Reddy: విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది.. వర్షాలపై మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x