LGM Movie OTT: కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కల్యాణ్, లవ్‌టుడే ఫేం ఇవానా జంటగా నటించిన చిత్రం 'ఎల్జీఎం' (Lets Get Married). రమేశ్ తమిళ్మని (Ramesh Thamilmani) దర్శకత్వం వహించిన ఈ సినిమాను ధోనీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ (Dhoni Entertainment banner)పై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni), ఆయన సతీమణి సాక్షి సింగ్(Sakshi Singh) నిర్మించారు. జులై 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ కొట్టింది.
థియేటర్లలో సక్సెస్ అయిన ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇస్తుందా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే అందరూ షాక్ ఇస్తూ ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియోలో అందుబాటులో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా యెుక్క తమిళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు వెర్షన్ ను ఇంకా అప్ డేట్ చేయలేదు.
స్టోరీలోకి వెళితే.. మీరా, గౌతమ్ ప్రేమించుకుంటారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత గౌతమ్ తల్లితో కలిసి ఉండాలనుకుంటాడు. అయితే మీరాకు అది ఉండటం ఇష్టం ఉండదు. ఈ సమయంలో మీరాకు, అమ్మకు మధ్య మంచి రిలేషన్షిప్ ఏర్పడేందుకు కూర్గ్ ట్రిప్ ప్లాన్ వేస్తాడు గౌతమ్. మరి ఇవానా కాబోయే అత్తమ్మతో సౌకర్యవంతంగా ఉంటుందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇందులో నదియా, యోగిబాబు కీ రోల్స్ పోషించారు.
Also Read: Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ సినిమాలో విలన్‌గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook