Lavanya Tripathi and Varun Tej wedding : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో స్టార్ బ్యూటీ లావణ్య త్రిపాఠి పెళ్లి సందడి మొదలు అయిపోయింది. నిన్న రాత్రి కాక్ టైల్ పార్టీతో వీరి పెళ్లి ఈవెంట్ లు మొదలయ్యాయి. ఇటలీలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతున్న సంగతి తెలిసిందే. నిన్న బోర్గో సాన్ ఫెలిస్ రిసార్ట్ లో వీరిద్దరి కాక్టైల్ పార్టీ కూడా ఘనంగా జరిగింది.
నాలుగు రోజులు పాటు జరగబోతున్న వరుణ్ తేజ్, లావణ్య ల పెళ్లి లో కాక్ టైల్ పార్టీ నిన్న రాత్రి 8:30 కి మొదలై అర్థరాత్రి దాకా కొనసాగింది. ఇవాళ ఉదయం 11 గంటలకి వీరిద్దరి హల్దీ ఫంక్షన్ కూడా జరగబోతోంది. ఇప్పటికే మెగా కుటుంబంతో పాటు అల్లు కుటుంబ సభ్యులు కూడా ఇటలీకి చేరుకున్నారు. అందరూ నిన్న కాక్ టైల్ పార్టీ లో వరుణ్, లావణ్య ల జంట తో కాక్ టైల్ పార్టీ లో పాల్గొన్నారు.
ముఖ్యంగా అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కూడా తమ భార్యలతో ఈ వేడుకలో చాలా ఎనర్జిటిక్ గా పాల్గొన్నారు. అంతేకాకుండా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఈ వేడుకకి హాజరయ్యారు. ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మెగా, అల్లు హీరోలను చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో చూస్తూ ఉండడంతో అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. వరుణ్ తేజ్ కారణంగా అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ఒకే వేదికపైకి వచ్చారని ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
All about the Last night #VarunLav ✨ cocktail party🎉@IAmVarunTej @Itslavanya
Global Star @AlwaysRamCharan
Icon StAAr @alluarjun #VarunTej #LavanyaTripathi #YouWeMedia pic.twitter.com/bgBnkSulUc— YouWe Media (@MediaYouwe) October 31, 2023
ఉదయం హల్దీ తర్వాత ఇవాళ సాయంత్రం ఐదున్నరకి మెహందీ ఈవెంట్ జరగబోతోంది. ఇరు కుటుంబాలు ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్నాయి. ఇక నవంబర్ 1వ తేదీన మధ్యాహ్నం 2:48 కి వీరి పెళ్లి కుటుంబ సభ్యుల ఆశీస్సులతో జరగబోతోంది. మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ మాత్రమే వీరి పెళ్లి కి హాజరవుతున్నారు.
పవన్ కళ్యాణ్ కూడా పెళ్లి పనుల్లో పాల్గొనబోతున్నారు. పెళ్లి రోజు సాయంత్రం 8:30 నుంచి వీరి పెళ్లి రిసెప్షన్ పార్టీ కూడా జరగబోతోంది. పెళ్లి కూడా పూర్తయ్యాక నవంబర్ 3న అందరూ ఇండియా కి తిరిగి రాబోతున్నారు. ఇండియా కి వచ్చేశాక ఇండస్ట్రీ లోని అతిధులను కూడా పిలిచి పార్టీ ఇవ్వాలని మెగా కుటుంబం ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook