Vinaro Bhagyamu Vishnu Katha Collection కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కొత్త కథలు ట్రై చేస్తూనే ఉన్నాడు. మరో వైపు కమర్షియల్ సినిమాలు కూడా ట్రై చేస్తున్నాడు. కానీ ప్రయోగాలు బెడిసి కొడుతూనే ఉన్నాయి. కమర్షియల్ సినిమాలు కాస్త పర్వాలేదనిపిస్తున్నాయి. ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా పర్వాలేదనిపించింది. కలెక్షన్ల పరంగా సినిమా గట్టెక్కిపోయింది.
ఆ తరువాత చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టేశాయి. ఇప్పుడు వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాతో వచ్చాడు. గీతా ఆర్ట్స్ 2 వంటి బ్యానర్ అవ్వడంతో సినిమా మీద ముందే అంచనాలు పెరిగాయి. పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నింటితో సినిమాపై మరింత క్రేజ్ పెరిగిపోయింది.
తిరుపతి బ్యాక్ డ్రాప్‌లో సినిమా తీయడంతో మరింత సహజంగా అనిపించింది. కిరణ్ అబ్బవరంకు ఈ సినిమా కలిసి వస్తుందని అంతా అనుకున్నారు. ప్రీమియర్లు షోలు వేయడం, పాజిటివ్ టాక్స్ రావడంతో సినిమా మీద మంచి హైప్ ఏర్పడింది. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగాయి. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి.
ఈ మూవీ ఓవరాల్‌గా నాలుగు కోట్ల బిజినెస్ చేసింది. నాలుగున్నర కోట్ల షేర్ వస్తే ఈ సినిమా క్లీన్ హిట్ అన్నట్టుగా అవుతుంది. అయితే ఈ సినిమాకు మొదటి రోజే దగ్గరదగ్గరగా 2.75 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ లెక్కన కోటిన్నరకు పైగానే షేర్ వచ్చినట్టు. అంటే దాదాపు ముప్పై నలభై శాతం రికవరీ చేసినట్టే.
బ్రేక్ ఈవెన్ పాయింట్‌ను చేరడానికి కిరణ్ అబ్బవరానికి మరీ అంత ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ మార్క్ కొట్టేసేలా ఉన్నాడు. అసలే టాక్ కూడా పాజిటివ్‌గా రావడం, ధనుష్ సార్ సినిమా కూడా పాజిటివ్ టాక్ రావడంతో ఈ వారం బాక్సాఫీస్ వద్ద కాస్త సందడి ఉండేట్టే కనిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vinaro Bhagyamu Vishnu Katha Collection : 'వినరో' వసూళ్లు చూడరో.. కిరణ్ అబ్బవరం కెరీర్ హయ్యస్ట్ ఓపెనింగ్స్?
థియేటర్లోకి వచ్చిన వినరో..
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా సందడి
పాజిటివ్ మౌత్ టాక్‌తో వసూళ్లు