Karthikeya 2 OTT: ఓటీటీకి సిద్దమైన 'కార్తికేయ‌ 2'.. స్ట్రీమింగ్ ఆరోజు నుంచే!

Nikhil's Karthikeya 2 to Stream from October 5th Exclusive on ZEE5: కార్తికేయ‌ 2 చిత్రం స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ5దక్కించుకోగా ఇప్పుడు స్ట్రీమింగ్‌ డేట్ కూడా వచ్చేసింది.   

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 26, 2022, 08:16 PM IST
Karthikeya 2 OTT: ఓటీటీకి సిద్దమైన 'కార్తికేయ‌ 2'.. స్ట్రీమింగ్ ఆరోజు నుంచే!

Nikhil's Karthikeya 2 to Stream from October 5th Exclusive on ZEE5: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కువగా తెలుగు సినిమాల మీదే చర్చ జరుగుతోంది. అలా ఈ ఏడాది తెలుగు నుంచి వచ్చి చాలా సినిమాలు జాతీయ స్థాయిలో సూపర్ హిట్ అయ్యాయి. ఇక 'కార్తికేయ‌ 2' కూడా చిన్న సినిమాగా విడుదలై అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచింది.

ఆగ‌స్టు 12న రిలీజ్ అయిన కార్తికేయ‌ 2 సినిమా ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీలో కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. భారీ బడ్జెట్ సినిమాలు బ‌హుబ‌లి, పుష్ప‌, ఆర్ఆర్ఆర్ స్థాయిలోనే నార్త్ ప్రేక్షుకుల్లో ఈ సినిమా మంచి క్రేజ్ సంపాదించింది. కార్తికేయ‌ 2 సినిమాకు సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో ఇప్పటిదాకా రకరకాల ప్రచారాలు జరిగాయి.

ఈ చిత్రం స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. భారీ ధ‌ర‌కు డిజిట‌ల్ హ‌క్కులను కొనుగోలు చేసింది. ఇప్పటికీ థియేటర్స్‌లో అదరగొడుతోన్నకార్తికేయ‌ 2 చిత్రం అన్ని భాషల్లో సెప్టెంబర్ 30 నుంచి స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ వెర్షన్స్ జీ5లో దసరా సంధర్భంగా అక్టోబర్ 5 నుంచి స్ట్రీమ్ కానుంది.

అడ్వేంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన కార్తికేయ‌ 2 సినిమాకు చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వహించగా అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ యువ హీరో నిఖిల్‌ లీడ్ రోల్లో నటించగా, మలయాళీ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌ణ్ హీరోయిన్‌గా న‌టించింది. బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కీల‌క‌ పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాలో శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా మూడో భాగం కూడా ఉండనుందని అంటున్నారు. 

Also Read: Jr NTR as Villain: ప్రశాంత్ నీల్ సరికొత్త ప్లాన్.. హీరో-విలనూ ఎన్టీఆరే.. మాములుగా ఉండదు మరి!

Also Read: Malaika Arora Hot Photos: స్ట్రాప్‌లెస్ డ్రెస్‌లో రెచ్చిపోయిన మలైకా.. కుర్రాళ్లకిక నిద్ర కరువే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News