Ram Charan: రామ్ చరణ్-బుచ్చిబాబు ప్రాజెక్ట్‌ లో కన్నడ స్టార్ ఎంట్రీ.. క్రేజీ కాంబో

RC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బుచ్చిబాబు సనా ప్రాజెక్ట్ కోసం.. ఇప్పుడు ఒక కన్నడ స్టార్ నటుడు రంగంలోకి దిగారు. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న సినిమా కాబట్టి.. ఇప్పుడు కన్నడ ప్రేక్షకులు కోసం దర్శకుడు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 12, 2024, 09:28 PM IST
Ram Charan: రామ్ చరణ్-బుచ్చిబాబు ప్రాజెక్ట్‌ లో కన్నడ స్టార్ ఎంట్రీ.. క్రేజీ కాంబో

RC16 Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..త్వరలోనే.. ఉప్పెన..వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ తో డెబ్యూ ఇచ్చిన దర్శకుడు.. బుచ్చిబాబు సానా తో.. కలిసి పనిచేయబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా రేంజ్ లో.. ఈ సినిమా విడుదలకి సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం.. చిత్ర బృందం విభిన్న భాషల.. నుండి ప్రముఖ నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కన్నడ స్టార్.. శివ రాజ్ కుమార్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్యాన్ ఇండియా రేంజ్ సినిమా.. కాబట్టి కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్.. వల్ల కన్నడలో కూడా సినిమాకి మంచి క్రేజ్ వస్తుంది. అందుకే క్యాస్టింగ్ విషయంలో చిత్ర బృందం.. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కన్నడలో మాత్రమే కాక.. సౌత్ మొత్తం మీద శివరాజ్ కుమార్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అది కూడా సినిమాకి బాగానే ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. 

బాలీవుడ్ నటి జాన్వి కపూర్..ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్‌గా.. ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. రామ్ చరణ్‌ని ఇప్పటివరకు లేని విధంగా ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా గురించి మాట్లాడుతూ రామ్ చరణ్.. కూడా చాలా గొప్పగా చెప్పారు. తన కెరియర్ లో ఇండస్ట్రీ హిట్ అయిన సినిమాలలో ఒకటైన.. రంగస్థలం సినిమా కంటే ఈ చిత్ర స్క్రిప్ట్ ఇంకా కొత్తగా ఉంది.. అని చెర్రీ స్వయంగా చెప్పడం ప్రేక్షకులకు మరింత ఆసక్తి కలుస్తుంది.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్.. ఈ మధ్యనే శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా అధికారిక విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించనుంది.

Read more: Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.

Read more: SpiceJet woman slaps: అంతమాటన్నాడా..?.. పోలీసును లాగిపెట్టి కొట్టిన స్పెస్ జెట్ ఉద్యోగిని.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News