Jithender Reddy Movie Review: ‘జితేందర్ రెడ్డి’ మూవీ రివ్యూ.. కామ్రేడ్స్ అరాచకాలపై పోరాడిన స్వయంసేవకుడి కథ..

Jithender Reddy Movie Review: గత కొన్నేళ్లుగా  సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ నడస్తోంది. ఇప్పటి వరకు స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ నాయకులు, నక్సలైట్స్, గ్యాంగ్ స్టర్స్ జీవితాలను తెరపై ఆవిష్కరించారు. నిజ జీవిత గాథల నేపథ్యంలో వస్తోన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో తెలుగులో వస్తోన్న మరో పొలిటికల్ స్వయంసేవకుడి కథే ‘జితేందర్ రెడ్డి’. ఈ నెల 8న విడుదల కాబోతున్న ఈ సినిమాను మీడియాకు ప్రత్యేకంగా ప్రీమియర్స్ వేసారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.  

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 7, 2024, 08:29 AM IST
Jithender Reddy Movie Review: ‘జితేందర్  రెడ్డి’ మూవీ రివ్యూ.. కామ్రేడ్స్ అరాచకాలపై పోరాడిన స్వయంసేవకుడి కథ..

రివ్యూ: జితేందర్  రెడ్డి (Jithender Reddy)

నటీనటులు:రాకేష్ వర్రే, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్ తదితరులు..

ఎడిటర్: రామకృష్ణ అర్రం

సినిమాటోగ్రఫీ: వి. ఎస్. జ్ఞాన శేఖర్

సంగీతం: గోపి సుందర్

సహ నిర్మాత: ఉమ రవీందర్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాణిశ్రీ పొడుగు

నిర్మాత : ముదుగంటి రవీందర్ రెడ్డి

దర్శకత్వం: విరించి వర్మ

తెలుగు సహా వివిధ భాషల్లో బయోపిక్స్ తెరకెక్కడం కొత్త కాదు. కానీ దేశం కోసం ఎలాంటి స్వార్ధం లేకుండా పనిచేసే స్వయంసేవకుల బయోపిక్స్ తెరకెక్కడం చాలా అరుదు. మన మాజీ తాజా ప్రధాన మంత్రులైన అటల్ బిహారి వాజ్ పేయ్, నరేంద్ మోడీ లు కూడా స్వయంసేవకులుగా ప్రస్థానం మొదలుపెట్టి దేశ అత్యున్నత పదవులు అందుకున్నారు. ఇలాంటి వాళ్లు పదవులు అందుకోవడంలో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల పాత్ర మరవలేనది. అలాంటి స్వయంసేవకుడి కథే జితేంద్ర రెడ్డి కథ. మరి ఈయన ఎవరు ? మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

జితేందర్ రెడ్డి కథ విషయానికొస్తే.. జితేందర్ రెడ్డి 1980లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జరిగిన యధార్ధ గాథ. జితేందర్ రెడ్డి కుటుంబం ముందు నుంచి ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు. దేశం కోసం, ధర్మం కోసం అహోరాత్రులు పనిచేసే కుటుంబం. అలాంటి ఫ్యామిలీలో పుట్టిన జితేందర్ రెడ్డి చిన్నపుడే ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలకు ఆకర్షితుడు అవుతాడు. అంతేకాదు దేశం, కోసం ధర్మం, ప్రజలు కోసం ఏదైనా చేయాలనుకునే తపన పడుతుంటాడు. చిన్నపుడు అతనికి ఓ నిండా 18 యేళ్లు లేని కుర్రాడిని అన్యాయంగా నక్సలైట్స్ హత్య చేస్తారు. ఆ ఊర్లో ఉండే పౌర హక్కుల నేత ప్రోద్బలంతో  ఆ పిల్లాడు దళంలో  చేరుతాడు. కానీ నక్సలైట్స్ పారిపోయి ఇంటికి వస్తాడు. ఆ తర్వాత నక్సలైట్స్ ఈ పిల్లాడు అని చూడకుండా దారుణంగా హత్య చేస్తారు. ఈ సంఘటనతో కామ్రేడ్స్ పై రగిలిపోతాడు. భూమి కోసం, పీడిత ప్రజల బాగు కోసం గన్నులు చేత పట్టినట్టు చెప్పుకునే నక్సలైట్స్ దారితప్పినట్టు తెలుసుకుంటాడు. ఆ తర్వాత కామ్రేడ్స్ పై జితేందర్ రెడ్డి ఎలాంటి పోరాటం చేసాడనేదే ఈ సినిమా స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
తెలుగు తెరపై ఎపుడు కామ్రేడ్స్ ను హీరోలుగా చూపిస్తూ సినిమాలు తెరకెక్కాయి. మన దగ్గర అన్ని వ్యవస్థల్లో పాతుకుపోయినా.. లెఫ్ట్, లిబరల్ ఏకో సిస్టం కారణంగా వారిని కథానాయకులుగా చూపిస్తూ వచ్చారు దర్శకులు. కానీ ఈ మధ్య నక్సలిజంలోని చీకటి కోణాలను వివరిస్తూ సినిమాలు తెరకెక్కుతున్నాయి. రీసెంట్ గా ఈ యేడాది విడులైన అదా శర్మ ‘బస్తర్’ సినిమా కూడా ఛత్తీస్ గడ్’ సినిమాలో నక్సలైట్స్ చేస్తున్న అరాచకాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. మన దేశంలో భారత్, పాకిస్థాన్ యుద్ధంలో చనిపోయిన సైనికులు, పోలీసులు, సామాన్య ప్రజల కంటే ఎక్కువ మంతి నక్సల్స్ చేతిలో చనిపోయారు.

ఇలాంటి కథలను తెరకెక్కిండం అంటే మాములు విషయం కాదు. సొమ్ములు ఉంటే సరిపోదు దాన్ని నిర్మించే గట్స్ ఉండాలి. దాన్ని తెరకెక్కించే దమ్ము, ధైర్యం ఉండాలి. అలాంటన్ని ఈ సినిమా దర్శక, నిర్మాతలకు ఉందనే విషయం జితేందర్ రెడ్డి సినిమా  చూస్తే తెలుస్తుంది. తెలుగు తెరపై ఇప్పటి వరకు నక్సలైట్స్ పై  పాజిటివ్ దృక్పథంతోనే సినిమాలు తెరకెక్కాయి. ఇక నక్సలిజంలోని చీకటి కోణాలను ఆవిష్కరించారు. ఒకపుడు పీడిత వర్గాల కోసం కన్నులు పట్టిన అన్నలు.. ఆ పీడిత వర్గాలను ఎదగకుండా చేసారు. అంతేకాదు ప్రభుత్వం చేపట్టే ప్రగతికి అడ్డుగా నిలుస్తున్నారు. ఆ విషయాన్ని దర్శకుడు విరించి వర్మ.. తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు.

ముఖ్యంగా చిన్నపుడే సమాజం పట్ల ఎంతో అంకితభావం ఉన్న జితేందర్ రెడ్డి .. సమాజానికి ఏదో మంచి చెయ్యాలనే తపనను చూపించాడు. ముఖ్యంగా కాలేజి రాజకీయాలు.. అప్పట్లో వివిధ విద్యావ్యవస్థల్లో బలంగా నాటుకుపోయిన PDSU ధీటుగా ABVB ఎలా ఎదురొడ్డి నిలబడిందనే విషయాన్ని తెరపై చక్కగా ప్రెజెంట్ చేసాడు. అప్పట్లో తెరకెక్కిన శివ సినిమా కూడా జితేందర్ రెడ్డి స్పూర్తిగా 1980వ దశకంలో జరిగిన నిజ జీవిత ఘటనలను తెరపై ఆవిష్కరించాడు. కాలేజీ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదగడం. మధ్యలో సమాజంలో అట్టడగు వర్గాల కోసం పాటుపడుతున్న స్వయంసేవకులను నక్సలైట్స్ కాల్చి చంపుతారు. దీంతో వారిపై తిరగబడతాడు.   పోలీసు వ్యవస్థకే ధీటుగా.. సమాజంలో నక్సలైట్లు చేసే అక్రమాలను ఎలా ఎదర్కొన్నాడు అనే ఎపిపోడ్స్ అలరిస్తాయి. రైతుల కోసం పాటు పడే సన్నివేశాలతో రాజకీయ నాయకులు చుట్టు తిరుగుతాడు. ప్రజల కోసం పొలిటికల్ లీడర్స్ చుట్టు తిరడగం కంటే తానే పొలిటికల్ లీడర్ అయితే బాగుంటుందనే అనే సీన్ బాగుంది. అంతేకాదు ఊర్లో తనకు ధీటుగా ఎదుగుతున్న నాయకుడిని నక్స లైట్స్ చేతుల మీదుగా చంపించడం వంటి ప్రతికార రాజకీయాలను సినిమాలు సృజించాడు దర్శకుడు.  ప్రతి ఫేమ్ బాగుంది. ఇంటర్వెల్ వరకు కాలేజీ రాజకీయాలను చూపించిన దర్శకుడు.. ఇంటర్వెల్ తర్వాత నాయకుడగా.. నక్సలైట్స్ పై తిరుగుబాటు చేయడం వంటివి చాలా బాగా డీల్ చేసాడు. మొత్తంగా తాను చెప్పదల్చుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఓ సన్నివేశంలో లెఫ్ట్ లిబరల్ వాళ్ల ఐడియాలజీ.. రైట్ వింగ్ ఐడియాలజీలను చెప్పిస్తూ వచ్చిన సీన్స్ ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా సనాతన ధర్మం గొప్పతనాన్ని ఆవిష్కరించాడు.

సినిమాలో ఓ సన్నివేశంలో  దేశం అంటే మట్టి కాదు.. మనుషులు.. సమాజం మనకు ఏం ఇచ్చిందనేది కాదు. మనం సమాజానికి ఏం ఇచ్చాము అనే డైలాగ్స్ బాగున్నాయి. ఎలక్షన్స్ సమయం అపుడు నీ ఇంటికి వచ్చి తినేవాడు నాయకుడు కాదు. మొత్తంగా సనాతన ధర్మం కోసం పోరాడే యోధుడి కథగా చెప్పుకోవాలి.  ఎలక్షన్ తర్వాత నువ్వు ఏం తింటున్నావో   తెలుసుకునే వాడు నిజమైన నాయకుడు అనే డైలాగ్స్ బాగున్నాయి. 1980ల నాటి ఆర్ట్ వర్క్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు కాస్త ఇబ్బంది పెట్టినా.. చివర్లో నక్సలైట్స్ చేతిలో చనిపోయిన స్వయంసేవకులును గుర్తు చేస్తూ వచ్చే పాట కంట తడిపెట్టిస్తోంది. క్లైమాక్స్ చూసి ప్రతి ఒక్కరు ఎమోషన్ ను గురవుతారు. మొత్తంగా ఇలాంటి చిత్రాలను ఎలాంటి ఖర్చుకు వెనకాడకుండా నిర్మించడం అభినందించదగ్గ విషయం.

రాకేష్ వర్రే ఫ్యామిలీ కథానాయకుడిగా ‘ఎవ్వరికీ చెప్పొద్దూ’ లాంటి లవ్ స్టొరీ చేసారు. తాజాగా హై ఓల్టెజ్  యాక్షన్ డ్రామా చెయ్యడం చాలా గొప్ప విషయం. జితేందర్ రెడ్డి పాత్రలో ఒదిగిపోయిన తీరు బాగుంది. మొత్తంగా ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. ఇక రాకేష్ వర్రే తర్వాత PDSU నేతగా నటించిన నటుడు యాక్టింగ్ బాగుంది. స్వయం సేవకుడిగా సుబ్బరాజు నటన, నక్సలైట్ లీడర్ గా ఛత్రపతి శేఖర్ నటన బాగుంది. మిగిలిన నటీనటులు తమ  పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్

కథ, కథనం

దర్శకత్వం

క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

పెద్ద స్టార్స్ లేకపోవడం

అక్కడక్కడ బోర్ కొట్టే సాంగ్స్

ఫస్ట్ హాఫ్ స్లో

పంచ్ లైన్.. జితేందర్  రెడ్డి’ .. కామ్రేడ్స్ అరాచకాలపై పోరాడిన స్వయంసేవకుడి కథ

రేటింగ్: 3.25/5

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News