INDIAN 2: అలా చేయాల్సి వస్తే సినిమాలే మానేస్తా : శంకర్

Director Shankar: డైరెక్టర్ శంకర్ భారత దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరు. భారతీయుడు ( Indian ), అపరిచితుడు ( Aparichitudu ),  రోబో, రోబో 2.0 (  Robot, Robot 2.0 ) వంటి చిత్రాలతో సామాజిక అంశాలను కూడా సూపర్ హిట్ సినిమాలుగా మలచగలరని ప్రూవ్ చేశాడు. ప్రస్తుతం ఇండియన్ 2 ( Indian 2 ) తెరకెక్కిస్తోన్న శంకర్ ఇటీవలే చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

Last Updated : Jun 22, 2020, 10:25 PM IST
INDIAN 2: అలా చేయాల్సి వస్తే సినిమాలే మానేస్తా : శంకర్

Director Shankar: డైరెక్టర్ శంకర్ భారత దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరు. భారతీయుడు ( Indian ), అపరిచితుడు ( Aparichitudu ),  రోబో, రోబో 2.0 (  Robot, Robot 2.0 ) వంటి చిత్రాలతో సామాజిక అంశాలను కూడా సూపర్ హిట్ సినిమాలుగా మలచగలరని ప్రూవ్ చేశాడు. ప్రస్తుతం ఇండియన్ 2 ( Indian 2 ) తెరకెక్కిస్తోన్న శంకర్ ఇటీవలే చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. 

Indian 2 మూవీలో కమల్ హాసస్ ( Kamal Haasan) లీడ్ రోల్‌లో కనిపించనున్నారు. భారతీయుడు ( Bharateeyudu ) చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ), రకుల్‌ ప్రీత్ సింగ్  ( Rakul Preet Singh ) హీరోయిన్స్ కాగా అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ( Lyca Productions ) పతాకంపై  సుభాష్కరణ్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను 2021 సమ్మర్‌లో విడుదల చేద్దాం అనుకున్నారు. అయితే కరోనా (  Coronavirus ) నేపథ్యంలో ఎక్కడి సినిమా ప్రొడక్షన్ పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో నిర్మాతలు విడుదల తేదీని 2022కు మార్చారు. 

కోవిడ్ -19  ( Covid-19 ) నేపథ్యంలో థియేటర్‌లు గత కొంత కాలంగా మూసివేసి ఉన్నాయి. ఇలాంటి సమయంలో  కొంత మంది నిర్మాతలు తన సినిమాలను డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్‌లోని ఓటీటీలో ( OTT ) విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ టైమ్‌లో శంకర్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తన సినిమాలు ఓటీటీలో (Over-the-Top ) విడుదల చేయాల్సి వస్తే గనక… అప్పుడు సినిమాలు తీయడం మానేస్తాను అన్నాడు. ఎందుకంటే శంకర్ తీసే సినిమాలు భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ఉంటాయి. వాటిని థియేటర్‌లో చూస్తేనే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. వాటికి కలెక్షన్స్ వల్ల నిర్మాతలకు లాభాలు వస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కీలకంగా మారాయి.

Trending News